Begin typing your search above and press return to search.

దివ్యాంగుల కోసం మెగా కార్య‌క్ర‌మంతో ఆద‌ర్శంగా..

By:  Tupaki Desk   |   6 Oct 2020 2:30 PM GMT
దివ్యాంగుల కోసం మెగా కార్య‌క్ర‌మంతో ఆద‌ర్శంగా..
X
టాలీవుడ్ స్టార్ హీరోల్లో రామ్ ‌చ‌ర‌ణ్ వైఫ్ ఉపాస‌నకు ఉన్న ప్ర‌త్యేక‌త వేరు. పెళ్లైన తొలి నాళ్ల‌లో ఈ జంటపై చాలానే కామెంట్‌లు వినిపించాయి. ఆ త‌రువాతే ఉపాస‌న ప్ర‌త్యేక‌త ఏంటో క్ర‌మ క్ర‌మంగా అంద‌రికి తెలిసి వ‌చ్చింది. యంగ్ బిజినెస్ ఉమెన్ త‌ర‌హాలో ఆమె అపోలో హాస్పిట‌ల్ కు సంబంధించిన బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తిస్తూ న‌లుగురి చేత శ‌భాష్ అనిపించుకుంటున్నారు.

వైల్డ్ లైఫ్ యానిమ‌ల్స్ కోసం రామ్ చ‌ర‌ణ్ ‌తో క‌లిసి న‌డుంబిగించిన ఉపాస‌న స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. తాజాగా `యు‌వ‌ర్ లైఫ్‌` పేరుతో ఓ వెబ్ ‌సైట్ ‌ని ప్రారంభించి దానికి అక్కినేని వారి కోడ‌లు స‌మంత‌ని గౌర‌‌వ అతిథి కం ఎడిట‌ర్ ‌గా నియ‌మించింది. ఆమెతో క‌లిసి పోష‌కాహారంపై అవ‌గాహ‌న క‌ల్పిస్తోంది.

తాజాగా మ‌రో అడుగు ముందుకేసింది. లోక‌ల్ టాలెంట్ ‌ని ప్రోత్స‌హించ‌డంలో భాగంగా `మ‌న ఊరు మ‌న బాధ్య‌త‌` అనే కాన్సెప్ట్ ‌ని మొద‌లుపెట్టింది. ఇందులో భాగంగా దివ్యాంగుల్లో వున్న టాలెంట్ ని.. డ్యాన్స్ ని ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌డం కోసం `హీల్ యువ‌ర్ లైఫ్ త్రూ డ్యాన్స్‌` అనే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌బోతోంది. ఈ ఆన్ ‌లైన్ టాలెంట్ షోకు రామ్ చ‌ర‌ణ్ హోస్ట్ గా వ్యవ‌హ‌రించ‌బోతున్నారు. చ‌ర‌ణ్ తో పాటు ఈ షోలో క్రేజీ కొరియోగ్రాఫ‌ర్స్ క‌మ్ డైరెక్ట‌ర్స్ ప్ర‌భుదేవా,.. ఫ‌రాఖాన్ లు కూడా పాల్గొన‌బోతున్నారు.