Begin typing your search above and press return to search.

చెర్రీ వైఫ్ స్పెషల్ ఇన్విటేషన్

By:  Tupaki Desk   |   3 July 2017 1:51 PM GMT
చెర్రీ వైఫ్ స్పెషల్ ఇన్విటేషన్
X
రామ్ చరణ్ భార్యగా ఉపాసన మెగా ఫ్యామిలీ మెంబర్ అయిన తర్వాత.. మెగా ఫ్యాన్స్ కు చేరువైపోయింది. అంతకు ముందే వైద్య రంగంలో ఆంట్రప్రెన్యూర్ గా ఉన్న ఈమె.. తన మంచి మనసును చాటుకుంటూ తెలుగు ప్రజలకు మరింతగా దగ్గరైంది. వైద్య రంగంలో ఈమె చేసిన సేవలకు గాను.. రీసెంట్ గా ఈమెకు ఓ స్పెషల్ అవార్డ్ కూడా అందింది.

ఆ అవార్డును చూపిస్తూ.. చెర్రీ అండ్ ఉపాసన ఒకరిపై ఒకరు చూపిన ప్రేమకు అందరూ ముగ్ధులైపోయారు. ప్రస్తుతం ఉపాసన యూఎస్ టూర్ లో ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలను ప్రోత్సహించాలనే తన ఆలోచనను.. ఈ సారి క్రియేటివ్ గా బైట పెట్టింది ఉపాసన. సోషల్ మీడియా ద్వారా మిస్టర్ సీ సినిమా కబుర్లతో పాటు హెల్త్ టిప్స్ కూడా ఇచ్చే ఉపాసన.. ఇప్పుడు అదే అకౌంట్ ద్వారా.. వినూత్న ఆలోచనలకు అక్కడి ప్రజల నుంచి ఆహ్వానం పలికింది. అందు కోసం పెళ్లి చూపులు మూవీలో కనిపించే ఫుడ్ ట్రక్ మాదిరిగా ఉన్న ఓ ఫ్రూట్స్ ట్రక్ ను చూపించింది.

ఓ చిన్న వీడియోను పోస్ట్ చేసిన ఉపాసన.. 'ఇలాంటి అద్భుతమైన ఆలోచనలు మీ దగ్గర ఉంటే.. మీకు మద్దతు ఇచ్చేందుకు అపోలో లైఫ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రండి.. కలిసి అద్భుతాలు సృష్టిద్దాం' అని చెప్పిన ఉపాసన.. 'upasana@apollolife.com'కు తమ కాన్సెప్ట్ ను పంపాలని చెప్పింది. ఈ కాన్సెప్టులు కనుక హెల్త్ పరంగా ఉంటే.. అపోలో వారి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం మరింత సులభం అని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/