Begin typing your search above and press return to search.

ట్రాన్స్ జెండర్స్ తో మెగా కోడలి సెలబ్రేషన్స్..!

By:  Tupaki Desk   |   3 Dec 2021 2:30 AM GMT
ట్రాన్స్ జెండర్స్ తో మెగా కోడలి సెలబ్రేషన్స్..!
X
రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మెగా కోడాలిగానే కాకుండా తన సేవాగుణంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్ గా ఉంటూనే.. మరోవైపు కుటుంబ బాధ్యతలు కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఉపాసన.. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతో పాటుగా సామాజిక అంశాలపైనా స్పందిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు తన భర్త చరణ్ గురించిన సంగతులు కూడా పంచుకుంటూ ఉంటారు.

ఇటీవల ఉపాసన ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహిళలు - పురుషులకు మధ్య బేధం చూడటం అనవసరమని.. ఎవరి బలం వారికి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన బెస్ట్ ఫ్రెండ్ ఒక ట్రాన్స్జెండరని.. తను మంచి ప్రతిభ కలిగి అన్ని విషయాల్లో చురుగ్గా ఉంటారని తెలిపింది. అయితే గురువారం ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ట్రాన్స్ జెండర్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన ఉపాసన.. వారితో కలిసి దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ గురించి ఎంతో గొప్పగా చెప్పేసింది ఉపాసన. జీవితాన్ని పరిపూర్ణంగా ఎలా బతకాలో వారి నుంచే నేర్చుకున్నానని.. ఆ కమ్యూనిటీతో ఇంత సన్నిహితంగా మెలిగే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని ఉపాసన చెప్పుకొచ్చింది. హైదరాబాద్ ట్రాన్స్ జెండర్ ఎథ్నిక్ కమ్యూనిటీ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని.. అందులో ప్రతీ ఒక్కరి వెనుక ఓ గొప్ప కథ ఉంటుందని తెలిపింది.

కాగా, ఉపాసన సోదరి అనుష్ పాలా పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆనీ మాస్టర్ ఆధ్వర్యంలో సంగీత్ ఈవెంట్ రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయి. అనుష్ పాలా పెళ్లిలో భాగంగా ట్రాన్స్ జెండర్లను ఉపాసన తన ఇంటికి ఆహ్వానించినట్టు కనిపిస్తోంది. ట్రాన్స్ జెండర్స్ తో మెగా కోడలు కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రాన్స్ జెండర్ ఫ్రెండ్ ఉన్నారని ఉపాసన చెప్పడమే కాకుండా.. ఆ కమ్యూనిటీతో కలసి టైం స్పెండ్ చేయడం గొప్ప విషయమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

''బ్లెస్సింగ్ సెర్మనీ అనేది & మానవత్వం & జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి ఒక సరైన అవకాశం. అనుష్ పాల్ వివాహ వేడుకలను ఎంతో ఆప్యాయంగా ప్రారంభించినందుకు లక్ష్మీనారాయణ త్రిపాఠికి ధన్యవాదాలు. జీవితాన్ని సంపూర్ణంగా ఎలా జీవించాలానేది మీరు ఎల్లప్పుడూ నాకు నేర్పుతారు. నేను హైదరాబాద్ లోని లింగమార్పిడి జాతి (ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ) సమాజాన్ని నిజంగా గాఢంగా గౌరవిస్తాను. ఇది భారతదేశంలోని పురాతనమైన వాటిలో ఒకటిగా చెప్పబడింది. హైదరాబాద్ లోని 6 బదాయి గృహాల ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వడం విశేషంగా భావిస్తున్నాం. జీవితం గురించి చెప్పడానికి వారి వద్ద గొప్ప కథలు ఉన్నాయి. ఆ కమ్యూనిటీతో మరింత సన్నిహితంగా సంభాషించగలిగినందుకు నేను సంతోషంగా ఉన్నాను'' అని ఉపాసన పోస్ట్ చేసారు.