Begin typing your search above and press return to search.

ఉపాసన కాఫీ టిప్స్ విన్నారా!!

By:  Tupaki Desk   |   18 Nov 2017 12:42 PM IST
ఉపాసన కాఫీ టిప్స్ విన్నారా!!
X
సినిమా హీరోల సతీమణులు ఎక్కువగా బయట ప్రపంచానికి కనిపించరు. ఎక్కడైనా వేడుకలలో సడన్ గా దర్శనం ఇచ్చే సరికి షాక్ అవుతాం. అయితే మెగా పవర్ స్టార్ సతీమణి మాత్రం అందుకు విరుద్ధమని అందరికి తెలిసిందే. మెగా కోడలు ఉపాసన కామినేని సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటారు. ప్రస్తుతం ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ హీరోయిన్స్ కి ఉన్న రేంజ్ లో ఉన్నారు.

మెగా కోడలి గానే కాకుండా తన బిజినెస్ పనులను కూడా చూసుకుంటూ ఎప్పుడు బిజీగా ఉండే ఉపాసన ఈ మధ్య సోషల్ మీడియాలో నెటిజన్స్ కి హెల్త్ టిప్స్ కూడా బాగానే ఇస్తున్నారు. మెగా మావయ్య గారికోసం అత్తయ్య గారి సూచనలతో ఒక వ్యక్తితో కాఫీని తాయారు చేయించారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో అందుకు సంబందించిన వీడియోను పోస్ట్ చేసి వివరణ ఇచ్చింది. సాయంత్రం 4 గంటల సమయంలో కాఫీ తాగితే చాలా మంచిదని నిద్ర కూడా బాగా పడుతుందని వివరించింది. ఇక జిమ్ వర్కౌట్స్ చేసేముందు బ్లాక్ కాఫీ తాగితే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయని సూచనలు కూడా ఇచ్చిందండోయ్.

ఇకపోతే ఉపాసన ఇలా ఫిట్నెస్ టిప్స్.. అపోలో హెల్డ్ ఫౌండేషన్ కు సంబంధించిన పనులను చూసుకుంటూ.. టైమ్ దొరికినప్పుడు మాత్రం రామ్ చరణ్‌ 'రంగస్థలం' సెట్స్ లో సందడి చేస్తోంది. మొన్ననే ఈ మెగా హీరోలందరూ లడఖ్ టూర్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆ టూర్ కూడా ఉపాసనే ఆర్గనైజ్ చేసిందట.