Begin typing your search above and press return to search.

చెర్రీ-ఉప్సీ.. 20 నిమిషాల్లో భారీ రియాక్షన్

By:  Tupaki Desk   |   20 July 2017 10:57 PM IST
చెర్రీ-ఉప్సీ.. 20 నిమిషాల్లో భారీ రియాక్షన్
X
టాలీవుడ్ లో చూడచక్కని జంటలలో రామ్ చరణ్.. ఉపాసన కూడా ఉంటారు. ఒకరిపై ఒకరి ప్రేమ.. అనురాగం ఉండడం ఒక ఎత్తయితే.. వాటిని ప్రదర్శించే తీరు ఇంకా ఆకట్టుకుంటూ ఉంటుంది. పైగా ఒకరు సినిమాల్లో స్టార్ హీరో.. మరొకరు మెడికల్ ఫీల్డ్ లో వెల్ నోన్ నేమ్. ఒకరికి కోట్లలో ఫాలోయర్స్ ఉంటే.. మరొకరిని లక్షల మంది స్ఫూర్తిగా తీసుకుంటారు.

అయినా సరే వీరి సోషల్ మీడియా పోస్టులు చూస్తే కామన్ పీపుల్ మాదిరిగా తప్ప.. సెలబ్రిటీస్ అనే ఫీలింగ్ కూడా కలగదు. ఒకరిని ఒకరు అభినందించుకోవడాలు.. పలకరించుకోవడాలు.. విషెస్ చెప్పుకోవడాలు.. అన్నీ సోషల్ మీడియా ద్వారా కూడా చేస్తూ ఆకట్టుకుంటారు ఉంటారు ఈ జంట. ఇవాళ తన భార్య ఉపాసన పుట్టిన రోజు సందర్భంగా ఓ స్పెషల్ పోస్ట్ పెట్టాడు చెర్రీ. ఇందులో కేవలం తామిద్దరం మాత్రమే ఉన్న ఫోటో కనిపిస్తుందంతే. ఓ హాలీడే టూర్ సందర్భంగా దిగిన ఈ ఫోటోను అభిమానులతో పంచుకున్న మెగా పవర్ స్టార్.. 'హ్యాపీ బర్త్ డే ఉపాసన' అంటూ సో సింపుల్ గా విష్ చేశాడు. అయితేనేం.. ఆ ఫోటో చూస్తే వారిద్దరి మధ్య ఎంతటి అన్యోన్యత ఉందనే విషయం అర్ధమవుతుంది. ఈ ఫొటోను పోస్ట్‌ చేసిన 20 నిమిషాల్లోనే 15 వేల రియాక్షన్స్‌ వచ్చాయి. అంటే ఈ జంటపై ఫ్యాన్స్ కు ఉన్న అభిమానం చూస్కోండి!!

ఇక చెర్రీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985ను శరవేగంగా పూర్తి చేయాలనే తలంపుతో ఉన్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ నే కేటాయిస్తోంది. ఓ పక్కా పల్లెటూరి సెట్ కోసం ఏకంగా 5 కోట్ల రూపాయలు పెట్టి సెట్ నిర్మాణం చేశారంటే.. ఈ మూవీకి ఏ రేంజ్ లో బడ్జెట్ పెట్టేస్తున్నారో అర్ధమవుతుంది.