Begin typing your search above and press return to search.

సైరా కోసం ఉపాసన???

By:  Tupaki Desk   |   2 Oct 2017 5:03 AM GMT
సైరా కోసం ఉపాసన???
X
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా సినిమా గురించి రోజుకో న్యూస్ వెలువాడుతూనే ఉంది. అయితే ఇప్పుడు మరొక న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా కొన్ని బాధ్యతలు తీసుకోబోతున్నారట. రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చెర్రీ రంగస్థలం 1985 సినిమాలో బిజీగా ఉండడం వల్ల అప్పటివరకు ఉపాసన సైరా వర్కింగ్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు తీసుకున్నారట.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కి సంబందించిన అన్ని ఏర్పాట్లని పూర్తి చేసుకున్నారు. మరి కొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది. అయితే రామ్ చరణ్ రంగస్థలం 1985 సినిమా షూటింగ్ తో చాలా బిజీగా ఉన్నాడు. దీంతో రెండు బాధ్యతలను ఒకేసారి నిర్వహించడం చాలా కష్టమైపోతుందని ఉపాసన వర్కింగ్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు తీసుకొని తన భర్త కి కాస్త సహాయంగా ఉండనున్నారట. ఆమె ఇంతకుముందు కూడా ఖైదీ నెంబర్ 150 - ధృవ సినిమాలకు కూడా పేరు వేసుకోలేదు కాని.. వర్కింగ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారని రూమర్లు రానే వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం ఆమె సొంత బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి.. సైరా సినిమాకోసం నిజంగా పనిచేస్తారా లేదా చూడాల్సి ఉంది.

ప్రస్తుతం సైరా సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్ రెడీ అవుతున్నాయి. మరి కొన్ని రోజుల్లో దర్శకుడు సురేందర్ రెడ్డి పక్కా ప్రణాళికతో షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నాడు. నయనతార కూడా అమెరికా నుండి వచ్చేసింది కాబట్టి.. అక్టోబర్ 20 నుండి షూటింగ్ మొదలవ్వడం ఖాయం అంటున్నారు.