Begin typing your search above and press return to search.
పోలీసులకు ఉపాసన యోగా పాఠాలు
By: Tupaki Desk | 18 Feb 2020 1:30 PM ISTమెగా కోడలు ఉపాసన కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యంను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. పలు వ్యాపారాలు నిర్వహిస్తూ ఎప్పుడు చాలా బిజీగా ఉండే ఉపాసన కొణిదెల వీలు చిక్కినప్పుడల్లా సోషల్ అవేర్ నెస్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. జంతువుల సంరక్షణ కోసం.. పక్షులను కాపాడమంటూ.. మహిళ సాధికారత ఇలా పలు విషయాల గురించి కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో అవగాహణ తీసుకు వచ్చేందుకు తనవంతు కృషి చేస్తూ ఉంటారు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ దాంతో కూడా జనాల్లో పలు సామాజిక సమస్యల గురించి అవగాహణ తీసుకు వచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు. తాజాగా పోలీసులకు యోగా చాలా అవసరం అంటూ వారి యోగా క్లాస్ ల ప్రారంబోత్సవంలో పాల్గొన్నారు. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో పోలీసులకు యోగా అవసరం ఎంత ఉందనే విషయమై ఆమె మాట్లాడారు.
పోలీసులు ఎక్కువ ఒత్తిడిని కలిగి ఉంటారు. శారీరక శ్రమ కూడా చాలా ఎక్కువ పడతారు. అందుకే వారికి యోగా తప్పనిసరి అంటూ చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్క పోలీస్ కూడా యోగా చేయడం వల్ల ఆరోగ్యం బాగుండటంతో పాటు మానసికంగా బలవంతులు అవుతారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.