Begin typing your search above and press return to search.

మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధుపై ఉపాసన కేసు..

By:  Tupaki Desk   |   5 Aug 2022 8:30 AM GMT
మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధుపై ఉపాసన కేసు..
X
ప్రపంచ సుందరి హర్నాజ్ సంధు లీగల్ నోటీసులు అందాయి. తమ సినిమా ప్రమోషన్లో పాల్గొనడం లేదని, ఆమెతో జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ పంజాబ్ నటి ఉపాసన చంఢీగడ్ కోర్టులో దావా వేశారు. తనకు జరిగిన నష్టంపై పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తాను వేసిన దావాలో పేర్కొంది.

దీంతో పంజాబ్ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. సంతోష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఉపాసన 'బై జీ కుట్టంగే' అనే సినిమాకు ఉపాసన నిర్మించారు. ఈ సినిమాలో హర్నాజ్ సన్షు ప్రధాన పాత్రలో నటించారు. అయితే మిస్ యూనివర్స్ కాకముందే హర్నాజ్ ఇందులో నటించారు. కానీ ఇప్పుడు ఆమె తన సినిమా ప్రమోషన్లో పాల్గొనడం లేదని ఉపాసన ఆరోపిస్తోంది.

ఈ సందర్బంగా ఉపాసన మాట్లాడుతూ 'నేను హర్నాజ్ కి మిస్ యూనివర్స్ కాకముందే 'బై జీ కుట్టంగే' సినిమాలో అవకాశం ఇచ్చా. అంతేకాకుండా 'యూరా దియన్ పూ బరన్'లోనూ హర్నాజ్ కథానాయకగా చేసింది. ఈ సినిమా కోసం నేను భారీ బడ్జెట్ కేటాయించాను.

అంతేకాకుండా ఈ సినిమా మే 27న విడుదల కావాల్సి ఉంది. కానీ హర్నాజ్ కోసం ఆగస్టు 19కి వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కోసం డేట్స్ ఇవ్వాలని అడిగితే నిరాకరిస్తుంది. పంజాబ సినిమా ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలి' అని అన్నారు.

'బై జీ కుట్టంగే'లో హర్నాజ్ సన్షుతో పాటు దేవ్ ఖరౌద్, గురుప్రీత్ ఘగీ నటించారు. ఈ సినిమాకు స్మీప్ కాంగ్ దర్శకత్వం వహించారు. అయితే హర్నాజ్ సన్షు ప్రధాన పాత్ర పోషించినందుకు ఆమె ప్రమోషన్లో పాల్గొనాలని డిమాండ్ చేస్తున్నారు. మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని దక్కించుకున్న తరువాత సందు తన సంతోష్ ఎంటర్టైన్మెంట్ స్టూడియో ఎల్ ఎల్ పీతో ఒప్పందం చేసుకున్నరని ఉపాసన తెలిపారు. అయితే ఆ సమయంలోనే సినిమా పూర్తయిన తరువాత ప్రమోషన్ కోసం వ్యక్తిగతంగా, వర్చువల్ గా అందుబాటులో ఉండాలని తెలిపానన్నారు. అయితే ఇప్పుడు హర్నాజ్ నిబంధనలు ఉల్లంఘించిందన్నారు.

ఇక ఉపాసన ఆరోపణలపై హర్నాజ్ స్పందించలేదు. దీంతో ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకుంటారోనని పంజాబీ సినీ ప్రియులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇటు ఉపాసన వేసిన దావాపై ఎలాంటి రియాక్షన్ ఉంటుందోనని ఎదురుచూస్తున్నారు. చంఢీగడ్ కు చెందిన మోడల్ హర్నాజ్ సంధు 2020-21 మిస్ యూనివర్స్ విజేతగా నిలిచింది. 21 ఏళ్లలోనే ఆమె ఈ కిరీటాన్ని దక్కించుకొని చరిత్ర సృష్టించింది. ఈ పోటీల్లో 79 దేశాలు పాల్గొనగా భారత్ నుంచి హర్నాజ్ ప్రపంచ సుందరిగా ఎన్నికైంది. అంతకుముందు 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా మిస్ యూనివర్స్ కిరీటాలను గెలుచుకున్నారు.