Begin typing your search above and press return to search.

అప్పటి వరకు 'AK' రీమేక్ తిరిగి సెట్స్ మీద‌కు రాక‌పోవ‌చ్చు..!

By:  Tupaki Desk   |   16 April 2021 7:15 PM IST
అప్పటి వరకు AK రీమేక్ తిరిగి సెట్స్ మీద‌కు రాక‌పోవ‌చ్చు..!
X
కరోనా పరిస్థితుల్లో ఎంత జాగ్రత్తలు తీసుకొని షూటింగ్స్ జరుపుతున్నా ఏదొక విధంగా నటీనటులు సాంకేతిక నిపుణులు మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ క్రమంలో అందులో నటించే ఆర్టిస్టులకు కోవిడ్ పాజిటివ్ వచ్చినా షూటింగ్ మొత్తం ఆపేసుకోవాల్సి వస్తోంది. దీంతో షెడ్యూల్ డిస్ట్రబ్ అవ్వ‌డ‌మే కాకుండా, ప్యాడింగ్ ఆర్టిస్టుల డేట్లు మ‌ళ్లీ దొరక్క నిర్మాత‌ల‌కి చాలా ఇబ్బందులు వస్తున్నాయని తెలుస్తోంది.

సీనియర్ నటుడు బ్ర‌హ్మాజీ కి కరోనా సోక‌డంతో ఆయన కీలక పాత్ర పోషిస్తున్న 'అయ్యప్పనుమ్ కోశీయుమ్' తెలుగు రీమేక్ షూటింగ్ ఏకంగా వారం రోజులు నుంచి నిలిపివేశారు. బ్ర‌హ్మ‌జీకి క‌రోనా తగ్గితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అనుకుంటుండగా.. ఇప్పుడు హీరో పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో 'ఏకే' రీమేక్ షూట్ తిరిగి ప్రారంభించడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. పవన్ క్వారంటైన్ లో ఉన్నప్పటి నుంచి నిర్మాత నాగవంశీ ఆయన వెంట ఉంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తూ, వైద్య సేవలను సమన్వయం చేస్తున్నారని సమాచారం.