Begin typing your search above and press return to search.

మేము అన్నట్లుగా అన్ని టాక్ షో లకు బాలయ్య షో బాప్‌

By:  Tupaki Desk   |   12 Jan 2022 10:44 AM GMT
మేము అన్నట్లుగా అన్ని టాక్ షో లకు బాలయ్య షో బాప్‌
X
నందమూరి బాలకృష్ణ అన్‌ స్టాపబుల్‌ అభిమానులు అనుకున్న దాని కంటే ఎన్నో రెట్లు సక్సెస్‌ అయ్యింది. బాలయ్య టాక్ షో ఎలా చేస్తాడో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. వారందరికీ కూడా సరైన సమాధానం ఇప్పుడు లభించింది. బాలయ్య టాక్ షో కు ఐఎండీబీ లో నెం.1 స్థానం దక్కింది. ప్రేక్షకులు బాలయ్య అన్‌ స్టాపబుల్‌ ను ఎక్కువ చూస్తున్నారను.. అంతే కాకుండా సోషల్ మీడియాలో అన్‌ స్టాపబుల్‌ గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. కనుక సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న కామెడీ నైట్స్ కపిల్‌ షో కూడా వెనక్కు వెళ్లింది. బాలయ్య తనదైన మార్క్ తో ఈ షోను నడిపిస్తున్నాడు. దీంతో ఆహా కు అనూహ్యంగా స్పందన తెచ్చి పెట్టాడు. బాలయ్య అన్‌ స్టాపబుల్‌ లో ఇప్పటికే పలువురు ప్రముఖ స్టార్స్ సందడి చేశారు. ఈ సంక్రాంతికి విజయ్ దేవరకొండ తన లైగర్ టీమ్ తో అన్ స్టాపబుల్‌ లో హడావుడి చేయబోతున్నాడు.

ఈ షో ఆరంభంకు ముందు ఆహా టీమ్‌ అన్ని టాక్ షో లకు బాప్‌ గా ఉంటుంది అన్నట్లుగా ప్రమోట్ చేశారు. ఏ షో ప్రారంభం అయిన సమయంలో అయినా ఇలాగే అంటారు.. అంత సీన్ ఈ షో కు ఉందా అని అనుకున్న వారు చాలా మంది ఉన్నారు. తెలుగు టాక్ షో లకే కాకుండా దేశ వ్యాప్తంగా టెలికాస్ట్‌ అవుతున్నా.. స్ట్రీమింగ్ అవుతున్న టాక్‌ షో ల్లో టాప్ టాక్ షో గా బాలయ్య అన్‌ స్టాపబుల్‌ నిలిచింది. దాంతో ఆహా టీమ్ తాజాగా ట్విట్టర్ లో బాలయ్య అన్‌ స్టాపబుల్‌ అన్ని టాక్ షో లకు మేము చెప్పినట్లుగానే ఇప్పుడు బాప్ అయ్యింది అన్నట్లుగా ట్వీట్‌ లో పేర్కొన్నారు. బాలయ్య బ్లాక్‌ బస్టర్‌ షో ఇప్పుడు మరింత మందికి చేరువ అవ్వడం ఖాయం అంటూ టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య తో అన్‌ స్టాపబుల్‌ అనే టాక్‌ షో చేయించాలి అని ఐడియా అల్లు అరవింద్ కు వచ్చిందట. అఖండ సినిమా షూటింగ్‌ లో ఉన్న సమయంలో అల్లు అరవింద్‌ స్వయంగా బాలయ్య కు ఫోన్ చేసి ఒక టాక్ షో చేద్దాం అన్నాడట. అందుకు వెంటనే ఓకే చెప్పడం.. షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత తానే స్వయంగా టాక్ షో గురించి మళ్లీ చర్చలు మొదలు పెట్టడం బాలయ్య చేశాడట. అలా ఆహా టాక్ షో కు అంకురార్పణ పడింది. ఏ సమయంలో ఆలోచన వచ్చిందో.. ఏ సమయంలో షో ను ప్రారంభించారో కాని మంచి విజయాన్ని దక్కించుకుని బాలయ్య కు సరికొత్త ఇమేజ్‌ ను తెచ్చి పెట్టడం మాత్రమే కాకుండా తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు సరికొత్త వినోదం కూడా అందించింది. బాలయ్య అన్ స్టాపబుల్‌ మొదటి సీజన్ ను 15 ఎపిసోడ్స్ తర్వాత ముగించే అవకాశం ఉంది. మళ్లీ ఇదే ఏడాది చివర్లో రెండవ సీజన్ ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.