Begin typing your search above and press return to search.

అన్ స్టాపబుల్ విత్ NBK సంక్రాంతి స్పెషల్

By:  Tupaki Desk   |   11 Jan 2023 4:37 PM GMT
అన్ స్టాపబుల్ విత్ NBK సంక్రాంతి స్పెషల్
X
పెద్ద తెర‌పై న‌ట‌సింహంలా విజృంభించ‌డ‌మే కాదు చిన్న‌ తెర‌పైనా హోస్ట్ గా అల‌రించ‌గ‌ల‌న‌ని నిరూపించారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. కేవ‌లం ఫ‌లానా జోన‌ర్ సినిమాల‌కే బాల‌య్య సూట‌బుల్ అనుకున్న‌వారికి మునుముందు వెరైటీని ప‌రిచ‌యం చేస్తాన‌ని క‌సిగా అన్నారు. ఇంకా చాలా ప్రయోగాలు చేస్తాన‌ని వీర‌సింహారెడ్డి ప్రీరిలీజ్ వేదిక‌పైనే అభిమానుల‌కు హింట్ ఇచ్చేశారు.

2023 సంక్రాంతి బ‌రిలో విడుదల కానున్న `వీరసింహా రెడ్డి` ప్ర‌చారానికి ఇప్పుడు OTT చాట్ షో `అన్‌స్టాపబుల్ విత్ NBK` అద‌న‌పు బూస్ట్ ఇస్తోంది. తాజా ఎపిసోడ్ లో వీర‌సింహారెడ్డి న‌టీమ‌ణులు హనీ రోజ్- వరలక్ష్మి శరత్‌కుమార్ స‌హా దర్శకుడు గోపీచంద్ మలినేని- నిర్మాత నవీన్ యెర్నేని తదితరులు పాల్గొన్నారు.

తాజాగా విడుదలైన ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. వీరసింహా రెడ్డి గురించి హోస్ట్ బాలకృష్ణ .. అతిథుల మధ్య వినోదాత్మక చర్చలు ప్రోమోలో ఆస‌క్తిని క‌లిగించాయి. ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర ఎలా ఉంటుందోనని చిత్రబృందం ఉత్కంఠను వ్యక్తం చేసింది. గోపిచంద్ మ‌లినేని కెరీర్ జ‌ర్నీలో ఏర్ప‌డిన ఇబ్బందుల గురించి ఆస్తి అమ్మ‌కం గురించి కూడా బాల‌య్య బాబు ఈ ఎపిసోడ్ లో ప్ర‌శ్నించారు. అలాగే టాపాసు లాంటి వ‌ర‌ల‌క్ష్మి ఎంతో ఎన‌ర్జిటిక్ గా వేదిక‌పై క‌నిపించారు. ఈ ఆస‌క్తిక‌ర‌ ఎపిసోడ్ ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.