Begin typing your search above and press return to search.

నాతో సినిమా ఎప్పుడు చేస్తావ్ రాజమౌళి: బాలయ్య

By:  Tupaki Desk   |   15 Dec 2021 11:59 AM GMT
నాతో సినిమా ఎప్పుడు చేస్తావ్ రాజమౌళి: బాలయ్య
X
నటసింహం నందమూరి బాలకృష్ణ ''అన్ స్టాపబుల్ విత్ NBK'' టాక్ షో ద్వారా ఓటీటీలో అదరగొడుతున్నారు. తెలుగు ఓటీటీ 'ఆహా' వేదికగా డిజిటల్ వరల్డ్ లో ఎంటర్ అయిన బాలయ్య.. వ్యాఖ్యాతగా తనకంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. సినిమాల్లో తనదైన శైలిలో డైలాగ్స్ తో అలరించే బాలకృష్ణ.. ఈ షోతో తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇప్పటి వరకు స్ట్రీమింగ్ నాలుగు ఎపిసోడ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి.

బాలయ్య 'అన్ స్టాపబుల్' టాక్ షోలో పాల్గొన్న మంచు మోహన్ బాబు - మంచు లక్ష్మీ - విష్ణు - నాని - బ్రహ్మానందం - అనిల్ రావిపూడి - శ్రీకాంత్ - బోయపాటి శ్రీను - ఎస్ఎస్ థమన్ - ప్రగ్యా జైస్వాల్ వంటి వారు గెస్టులుగా హాజరై ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసారు. ఈ క్రమంలో త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రానున్నారు. అయితే అంతకంటే ముందు నటసింహంతో దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ముచ్చటించారు.

తాజాగా జక్కన్న పాల్గొన్న 'అన్ స్టాపబుల్ విత్ NBK' లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని ఆహా టీమ్ సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది. రాజమౌళికి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన బాలయ్య.. ''మీరు ఆల్రెడీ ఇంటెలిజెంట్ అని అఛీవర్ అని అందరికీ తెలుసు. మరి ఈ ఇంకా ఈ తెల్ల గడ్డం ఎందుకు?'' అని ప్రశ్నించారు. అలానే ''ఇప్పటి వరకు మన కాంబినేషన్ లో సినిమా పడలేదు.. నా అభిమానులు 'బాలయ్య తో సినిమా ఎప్పుడు?' అని అడిగారు.. దీనికి మీ సమాధానం ఏంటి?'' అని అగ్ర నటుడు అడిగారు.

''మీతో సినిమాలు చేసిన హీరోలకు ఇండస్ట్రీకి హిట్ ఇస్తారు.. ఆ తర్వాత వారి రెండు మూడు సినిమాలు ఫసక్కేగా..?'' అని బాలయ్య వ్యంగ్యంగా ప్రశ్నించగా.. ఈ మూడిటికీ రాజమౌళి నోటితో ఆన్సర్ చెప్పకుండా.. కేవలం హావభావాలు మాత్రమే పలికించారు. 'సమాధానాలు చెప్పరేంటి రాజమౌళి గారూ?' అని బాలకృష్ణ అంటుండగా.. ''మీకూ తెలుసు నాకూ.. తెలుసు చూస్తున్న వారందరికీ తెలుసు ఇది ప్రోమో అని.. సమాధానాలు ఎపిసోడ్ లో చెబుతా సార్..'' అని జక్కన్న చెప్పడం నవ్వులు పూయిస్తోంది.

ఇందులో రాజమౌళితో పాటుగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కూడా బాలయ్య 'అన్ స్టాపబుల్' షో లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆహా బృందం బుధవారం సోషల్ మీడియాలో వదిలింది. ఈ క్రమంలో లేటెస్టుగా ప్రోమోని రిలీజ్ చేసింది. బాలకృష్ణ - జక్కన్న మధ్య ఫన్నీ ఫన్నీగా సాగిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో వీరి సంభాషణ ఎలా ఉంటుందో అని.. పూర్తి ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్ ఆహాలో క్రిస్మస్ సందర్భంగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.