Begin typing your search above and press return to search.

AHA బాల‌య్య‌! అనిపించింది అందాం.. అనుకున్న‌ది చేద్దాం.. ఎవ‌డాపుతాడో చూద్దాం!

By:  Tupaki Desk   |   31 Oct 2021 7:33 AM GMT
AHA బాల‌య్య‌! అనిపించింది అందాం.. అనుకున్న‌ది చేద్దాం.. ఎవ‌డాపుతాడో చూద్దాం!
X
ఆహా- తెలుగు ఓటీటీ బ్యాక్ టు బ్యాక్ ప్ర‌యోగాల గురించి తెలిసిందే. కరోనా క్రైసిస్ ని ఆహా తెలివిగా స‌ద్వినియోగం చేసుకుని స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను పెంచుకోడంలో స‌ఫ‌ల‌మైంది. ఇందులో సామ్ జామ్ త‌ర్వాత ఆక‌ర్షణీయ‌మైన షోల‌ను ప్లాన్ చేస్తున్నారు. బాస్ అల్లు అర‌వింద్ మెరిక‌ల్లాంటి కాంబినేష‌న్స్ సెట్ చేసి అద్భుత‌మైన ఎపిసోడ్స్ తో ఆహా వేదిక‌ను రంజింప‌జేస్తున్నారు. ఓవైపు క్రియేటివ్ స్ట‌ఫ్ ఉన్న సినిమాల్ని అందిస్తూనే వెబ్ సిరీస్ ల‌ను నిర్మిస్తూనే మ‌రోవైపు స్పెష‌ల్ ఓటీటీ షోల‌కు కూడా పెద్ద పీట వేస్తున్నారు.

అదే కోవ‌లో తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ‌- మంచు మోహ‌న్ బాబు రేర్ కాంబినేష‌న్ తో అద్భుత‌మైన ఎపిసోడ్ ని తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తెస్తున్నారు. `అన్ స్టాప‌బుల్` ఎపిసోడ్ పేరుతో తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ఎంతో మ‌నోహ‌రంగా ఆక‌ట్టుకుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ ఎన్.బి.కె ఇచ్చిన ఎంట్రీ గుబులు రేప‌గా.. ఇక క‌ళాప్ర‌పూర్ణ‌మో! అంటూ క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహ‌న్ బాబును ఎన్.బి.కే ఆహ్వానించిన తీరు ఆద్యంతం రంజింప‌జేసింది.

నేను మీకు తెలుసు నా స్థానం మీ మ‌న‌సు! అంటూ బాల‌య్య అభిమానుల ముందుకు వ‌చ్చిన‌ తీరు వ్వావ్ అనిపిస్తుంది. ఇక వేదిక‌పై బాల‌య్య వేష‌ధార‌ణ ఆహా అనిపిస్తుంది. మోహ‌న్ బాబుతో ప్రోమో ఆద్యంతం అద్భుత‌మైన చెణుకులు విసిరారు బాల‌య్య‌.. అట్నుంచి ఎంబీ కూడా ఎందులోనూ త‌గ్గ‌లేదు.

ఎంబీ `నా వైఫ్ నిర్మ‌ల‌...` అన‌గానే.. `అదే పిన్నిగారు!` అంటూ బాల‌య్య నాలుక క‌రుచుకుంటూ విసిరిన పంచ్.. గొప్ప హ్యూమ‌ర‌సాన్ని ఆవిష్క‌రించ‌డ‌మే గాక ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. ఎంబీ జీవితంలో కొన్ని ర‌హ‌స్యాల్ని బాల‌య్య లీక్ చేస్తున్నార‌ని అర్థ‌మైంది.

చిరంజీవి గారి మీద మీకు నిజంగా ఉన్న అభిప్రాయ‌మేంటి? .. అంటూ మోహ‌న్ బాబును బాల‌య్య ప్ర‌శ్నించ‌గా.. `ఆయ‌న‌న్నీ చూస్తుంటాడు..` అంటూ ఇంకేదో చెబుతుండ‌గా.. సోద‌రా పొలిటిక‌ల్ గా డిప్ల‌మాటిక్ గా ఆన్స‌ర్ ఇవ్వొద్దు అంటూ బాల‌య్య వ్వావ్ అనిపించారు . ఇదే వేదిక‌పై ఏక్ పెగ్గులా అంటూ మాసిజాన్ని ఆవిష్క‌రించారు. అంతేకాదు త‌న కెరీర్ జ‌ర్నీలో స్ట్ర‌గుల్స్ గురించి చెబుతూ.. హీరోగా వైఫ‌ల్యాలు చూశాక‌.. ఇల్లు అమ్మేసార‌ట‌. ఆ త‌ర్వాత మోహ‌న్ బాబు త‌న కుటుంబంతో అనుభ‌వించిన ఆవేద‌నను వెల్ల‌డించారు ఈ వేదిక‌పై.. అర‌విందే నిన్ను అడ‌గ‌మ‌ని ఈ ప్ర‌శ్న‌ల‌ను చెప్పాడు అంటూ మోహ‌న్ బాబు బాల‌య్య‌తో స‌ర‌దాగా అన్నారు. మంచు ల‌క్ష్మి.. విష్ణు కూడా ఈ వేదిక కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ల‌క్ష్మీ మంచు జై బాల‌య్య అంటూ ఉత్సాహం పెంచారు. ప్రోమోలోనే ఇంత కిక్కుంది. ఇక పూర్తి ఎపిసోడ్ అభిమానుల్ని ఏ రేంజులో అల‌రిస్తుందో ఊహించ‌గ‌లం. ప్రేక్ష‌కులు క‌న్ఫామ్ గా ఆహా అంటారు!