Begin typing your search above and press return to search.

బాల‌య్య `అన్ స్టాప‌బుల్` ఖ‌తాలో మ‌రో రికార్డ్‌

By:  Tupaki Desk   |   11 May 2022 1:30 AM GMT
బాల‌య్య `అన్ స్టాప‌బుల్` ఖ‌తాలో మ‌రో రికార్డ్‌
X
బుల్లితెర‌పై టాక్ షోల ట్రెండ్ న‌డుస్తోంది. నాగార్జున నుంచి రానా.. నాని వ‌ర‌కు టాక్ షోలు, రియాలిటీ షోల‌తో హీరోలు కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేశారు. కింగ్ నాగార్జున బిగ్ బాస్ రియాలిటీ షో, మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు వంటి షోల‌తో త‌న‌దైన మార్కుని సెట్ చేశారు.

ఇక తాజాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీ రియాలిటీ షోకు కూడా హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నారు. రానా నెం.1 యారీతో హోస్ట్ గా మారి ఆకట్టుకుంటే నేచుర‌ల్ స్టార్ నాని కూడా బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన త‌న‌దైన మార్కు ఎంట‌ర్ టైన్ మెంట్ ని అందించాడు.

ఇదిలా వుంటే వీరంద‌రికి భిన్నంగా బాల‌య్య `అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె` తో తొలిసారి హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు. `ఆహా` కోసం ప్ర‌త్యేకంగా హోస్ట్ అవ‌తారం ఎత్తిన బాల‌య్య ఈ షోతో రియాలిటీ షోల్లో రికార్డుల మోత మోగించేశారు. మోస్ట్ వీవుడ్ రియాలిటీ షోగా `అన్ స్టాప‌బుల్‌` ఐఎండీడీలో స‌రికొత్త‌ రికార్డుని సొంతం చేసుకుని ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. బాల‌య్య తొలిసారి హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించిన ఈ షో అత్య‌ధికంగా స్ట్రీమింగ్ అయిన షోగా కూడా రికార్డుని సొంతం చేసుకుంది.

సెల‌బ్రిటీ టాక్ షోల్లో బెస్ట్ టాక్ షోగా పేరు తెచ్చుకుంది. అంతే కాకుండా ఈ షోలో ప్ర‌ముఖుల‌తో త‌న‌దైన స్టైల్లో బాల‌య్య జ‌రిపిన సంభాష‌ణ‌లు ప్రేక్ష‌కుల్ని మ‌రింత‌గా ఆక‌ట్టుకుని సూప‌ర్ హిట్ షోగా నిల‌బెట్టాయి. అయితే తాజాగా బాల‌య్య ఖాతాలో మ‌రో రికార్డు వ‌చ్చి చేరింది. సెల‌బ్రిటీ టాక్ షోల్లో నెంబ‌ర్ వ‌న్ షోగా రికార్డులు సొంతం చేసుకున్న `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికె` ఖాతాలో తాజాగా రెండు సిల్వ‌ర్ ట్రోఫీలు వ‌చ్చి చేరాయి.

బెస్ట్ రీజిన‌ల్ టీవీ ప్రోగ్రామ్‌, బెస్ట్ రీజిన‌ల్ టీవీ రియాలిటీ షో విభాగాల్లో రెండు సిల్వ‌ర్ ట్రోఫీలు తాజాగా ఈ షోకు ద‌గ్గ‌డం విశేషం. త్వ‌ర‌లోనే ఈ షో సీజ‌న్ 2 ప్రారంభిం కానున్న నేప‌థ్యంలో రెండు సిల్వ‌ర్ ట్రోఫీలు ఈ షోకు ద‌క్క‌డం విశేషంగా చెబుతున్నారు.

బ‌ల‌కృష్ణ ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని డైరెక్ష‌న్‌లో ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని చేస్తున్న విష‌యం తెలిసిందే. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్నఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. దునియా విజ‌య్ ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ గా న‌టిస్తున్నారు.