Begin typing your search above and press return to search.

అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ రేంజ్ లో 'అన్ స్టాపబుల్ 2' టీజర్..!

By:  Tupaki Desk   |   5 Oct 2022 3:11 AM GMT
అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ రేంజ్ లో అన్ స్టాపబుల్ 2 టీజర్..!
X
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారిగా హోస్ట్ గా వ్యవహరించిన సెలబ్రిటీ టాక్ షో "అన్ స్టాపబుల్ విత్ NBK". తెలుగు ఓటీటీ ఆహా రూపొందించిన ఈ ప్రోగ్రామ్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య లోని మరో కోణాన్ని ఆవిష్కరించిన ఈ టాక్ షో అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో ఇప్పుడు సీజన్-2 పై అందరిలో ఆసక్తి నెలకొంది.

తెలుగు ఓటీటీ స్పేస్ లో అత్యంత వినోదభరితమైన సెలబ్రిటీ టాక్ షో "అన్ స్టాపబుల్" ఇప్పుడు సీజన్ 2 కోసం రెడీ అయింది. నందమూరి బాలకృష్ణ ఈ షోకి మళ్లీ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్స్ - షో అంథెమ్ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా విజయవాడలో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె 2' గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ నిర్వహించారు.

దసరా ఈవెంట్ లో భాగంగా 'ఆహా' టీమ్ "అన్ స్టాపబుల్ 2" ప్రోమో టీజర్ ని విడుదల చేసారు. బాలకృష్ణ ను సరికొత్త అవతార్ లో ప్రెజెంట్ చేసిన ఈ టీజర్ అద్భుతంగా ఎంతో ఆసక్తికరంగా ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ బాలయ్య ఏదో వెతుకుతూ గుహలోకి వెళ్తున్నట్లు ఈ టీజర్ లో చూపించారు.

సీనియర్ హీరో గెటప్ మరియు సెటప్ అంతా ఒక అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ ను గుర్తు చేస్తున్నాయి. ఒక చేతిలో ఆయుధం మరో చేతిలో నిప్పు కాగడా పట్టుకొని కనిపించారు బాలయ్య. అయితే ఈ వెతుకులాట దేని కోసం అనేది తెలియాలంటే ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే.

"అన్ స్టాపబుల్ 2" ట్రైలర్ కు 'జాంబి రెడ్డి' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. మొదటి సీజన్ ప్రోమోని కూడా అతనే డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మరింత గ్రాండ్ గా ట్రైలర్ ను రూపొందించినట్లుగా టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇది కచ్చితంగా షో పై ఆసక్తిని రెట్టింపు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

'ఆహా' ఓటీటీలో త్వరలోనే ప్రసారం కానున్న 'అన్ స్టాపబుల్' సీజన్-2 కు చీఫ్ గెస్టులుగా ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇందులో భాగంగా మొదటి ఎపిసోడ్ కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. మరి బావా బామర్దిల సాగిన ఈ ఎపిసోడ్ ఎలాంటి వినోదాన్ని పంచుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.