Begin typing your search above and press return to search.

అన్ స్టాప‌బుల్ 2: పెళ్లిళ్ల‌పై ప‌వ‌న్ క్లారిటీ ఇచ్చేస్తున్నాడా?

By:  Tupaki Desk   |   28 Dec 2022 9:30 AM GMT
అన్ స్టాప‌బుల్ 2: పెళ్లిళ్ల‌పై ప‌వ‌న్ క్లారిటీ ఇచ్చేస్తున్నాడా?
X
నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హరిస్తున్న మోస్ట్ పాపుల‌ర్ టాక్ షో 'అన్ స్టాప‌బుల్ విత్ ఎన్ బికె'. రీసెంట్ గా సీజ‌న్ 1 బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో తాజాగా సీజ‌న్ 2 ని స్టార్ట్ చేశారు. సీజ‌న్ 2 మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి బ్యాక్ టు బ్యాక్ క్రేజీ స్టార్ల‌ని బాల‌య్య షోలోకి ఆహ్వానిస్తూ ఓ రేంజ్ లో వారితో ర‌చ్చ చేస్తూ వ‌స్తున్నారు. ఇటీవ‌లే పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఈ టాక్ షోలోకి ఎంట్రీ ఇవ్వ‌డం.. ఈ ప్ర‌త్యేక ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసుకోవ‌డం.. ప్రోమో కూడా రిలీజ్ కావ‌డం తెలిసిందే.

ప్రభాస్, గోపీచంద్ ల‌తో క‌లిసి బాల‌య్య ప్ర‌త్యేకంగా పూర్తి చేసిన తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారుతోంది. ఈ ఎపిసోడ్ డిసెంబ‌ర్ 30న ఆహాలో స్ట్రీమింగ్ కానున్న నేప‌థ్యంలో ఈ షో లోకి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఎంట‌రయ్యారు. ఎప్పుడెప్పుడు ప‌వ‌న్ ఈ షోలోకి ఎంట్రీ ఇస్తాడా? అని ఎదురు చూస్తున్న అభిమానులు ఎదురు చూపుల‌కు తెర‌దించుతూ మంగ‌ళ‌వారం అన్న పూర్ణ స్టూడియోస్ లో ప‌వ‌న్ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ మొదలైంది.

ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇదిలా వుంటే ఈ టాక్ షోలో బాల‌కృష్ణ ..ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు పెళ్లిళ్ల‌పై ప్రశ్రించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. బాలయ్య సంధించే ప్ర‌శ్న‌ల‌కు ప‌వ‌న్ కూడా అదే స్థాయిలో స‌మాధానాలు చెప్పిన‌ట్టుగా చెబుతున్నారు. గ‌త కొంత కాలంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు పెళ్లిళ్లు ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో, రాజ‌కీయాల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారడం, ప‌వ‌న్ పెళ్లిళ్లు ప్ర‌త్యర్థి పార్టీల‌కు ఆయుధంగా మారుతుండ‌టం తెలిసిందే.

దీంతో బాల‌య్య అన్ స్టాప‌బుల్ షో లో మూడు పెళ్లిళ్ల పై ప‌వ‌న్ క‌ల్యాణ్ క్లారిటీ ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోంది. ముందు నుంచి ఈ షోలో ప‌వ‌న్ ని బాల‌య్య వ్య‌క్తిగ‌త విష‌యాల‌కు సంబంధించిన ప్ర‌శ్న‌ల్ని సంధించే అవ‌కాశం లేద‌ని, ప‌వ‌న్ ముందుగానే పెళ్లిళ్ల విష‌యంలో ఎలాంటి ప్ర‌శ్న‌లు వేయోద్ద‌ని కోరాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని, ప‌వ‌న్ ఈ షో సాక్షిగా త‌న మూడు పెళ్లిళ్ల‌పై క్లారిటీ ఇచ్చేశాడ‌ని తెలుస్తోంది.

ఇటీవ‌ల ఓ ప‌బ్లిక్ మీటింగ్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌పై వైఎస్సార్సీపీ నేత‌లు చేస్తున్న మూడు పెళ్లిళ్ల విమ‌ర్శ‌ల‌కు చెప్పుతో స‌మాధానం చెబుతాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. మ‌రి అన్ స్టాప‌బుల్ లో ప‌వ‌న్ ఎపిసోడ్ బ‌య‌టికి వ‌చ్చాక.. వైఎస్సార్సీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాల‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.