Begin typing your search above and press return to search.

ఆమెకు అభిమానిగా జనతా విలన్

By:  Tupaki Desk   |   30 Jan 2017 3:40 PM IST
ఆమెకు అభిమానిగా జనతా విలన్
X
జనతా గ్యారేజ్ మూవీతో టాలీవుడ్ జనాలకు తెగ దగ్గరైపోయాడు మలయాళ హీరో ఉన్ని ముకుందన్. మోహన్ లాల్ కొడుకుగా నటించి.. ఎన్టీఆర్ కు విలన్ గా మెప్పించడం అంటే చిన్న విషయం కాదు. అయినా సరే జనతా గ్యారేజ్ లో తన ట్యాలెంట్ చూపించిన ఉన్న ముకుందన్.. త్వరలో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

బాహుబలి.. సింగం3లతో పాటు అనుష్క నటిస్తున్న మరో చిత్రం భాగమతి. ఈ మూవీలో కీలకపాత్ర పోషిస్తున్న ఉన్న ముకుందన్.. సామాజిక కోణంలో ఈ మూవీ తెరకెక్కుతోందని.. దర్శకుడు అశోక్ అద్భుతంగా తీస్తున్నాడని అంటున్నాడు. 'అనుష్క లాంటి స్టార్ తో వర్క్ చేయడం చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది. దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క.. వర్క్ విషయంలో చూపిస్తున్న కమిట్మెంట్ చూసి ఆమెకు అభిమానిగా మారిపోయా' అంటున్నాడు ఉన్ని ముకుందన్.

అంతే కాదు.. భాగమతిలో తన పాత్ర గురించి కూడా చెప్పాడు ఉన్ని ముకుందన్. 'శక్తి అనే సోషల్ యాక్టివిస్ట్ పాత్రను భాగమతిలో పోషిస్తున్నాను. ఆస్ట్రేలియాలో ఎంబీఏ చేసినా.. దేశభక్తి ఎక్కువగా ఉండడంతో.. ఉద్యోగం వదిలేసి ఇండియాకి వచ్చేసే రోల్ ఇది. గ్రామాల్లో పిల్లలకు చదువు చెప్పడం.. ఏదైనా సదుద్దేశ్యం కోసం ప్రజల్లో స్ఫూర్తి నింపడం' అనే యాంగిల్ లో నా పాత్ర ఉంటుంది' అని చెప్పాడు ఉన్ని ముకుందన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/