Begin typing your search above and press return to search.

'యశోద' కోసం దిగిపోయిన మలయాళ స్టార్!

By:  Tupaki Desk   |   21 Dec 2021 4:32 AM GMT
యశోద కోసం దిగిపోయిన మలయాళ స్టార్!
X
తెలుగులో మొదటి నుంచి కూడా తమిళ స్టార్స్ ఎక్కువగా కనిపించేవారు. టాలీవుడ్ సినిమాలపై కోలీవుడ్ ఎక్కువగానే ప్రభావం చూపుతూ వచ్చింది. తమిళ సినిమాలు ఇక్కడ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉండటం .. అక్కడి ఆర్టిస్టులు ఇక్కడి సినిమాల్లో ముఖ్యమైన రోల్స్ చేస్తూ వస్తుండటం జరిగింది.

కోలీవుడ్ ఆర్టిస్టుల తో పోలిస్తే మలయాళం నుంచి టాలీవుడ్ కి వచ్చిన ఆర్టిస్టులు చాలా తక్కువనే చెప్పాలి. మమ్ముట్టి .. మోహన్ లాల్ .. సురేశ్ గోపి మాత్రమే అప్పట్లో తెలుగు తెరపై సందడి చేశారు. ఆ తరువాత చాలా గ్యాప్ వచ్చేసింది.

ఇక ఇప్పుడు తెలుగు తెరపై మలయాళ కథల జోరు కనిపిస్తోంది. అలాగే మలయాళ ఆర్టిస్టుల రాక కూడా ఎక్కువైంది. హీరోగా దుల్కర్ ను ఇక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్ 'పుష్ప' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఆయనకంటే ముందుగానే తెలుగు ఇండస్ట్రీకి ఉన్ని ముకుందన్ వచ్చాడు.

తనదైన ప్రత్యేకతను చాటుతూ ఇక్కడి నుంచి మంచి అవకాశాలను అందుకుంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'జనతా గ్యారేజ్' సినిమా ద్వారా ఆయన తెలుగు తెరకి పరిచయమయ్యాడు. ఆ తరువాత వచ్చిన 'భాగమతి'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇప్పుడు ఉన్నిముకుందన్ చేతికి తెలుగు నుంచి మరో ప్రాజెక్టు వెళ్లింది .. ఆ సినిమా పేరే 'యశోద'. సమంత ప్రధానమైన పాత్రను పోషిస్తున్న థ్రిల్లర్ మూవీ ఇది. హరి అండ్ హరీశ్ ఈ సినిమాకి దర్శకులుగా వ్యవహరించనున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మొదటి నుంచి కూడా శ్రీదేవి మూవీస్ వారికి మంచి పేరు ఉంది. ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చిన చరిత్ర ఈ బ్యానర్ కి ఉంది. బలమైన .. విభిన్నమైన కథాకథనాలు లేకుండా వారు సెట్స్ పైకి వెళ్లరు. అందువలన సహజంగానే ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లోనే ఉన్ని ముకుందన్ జాయిన్ కానున్నాడు. ఆయన ఈ సినిమాలో గౌతమ్ అనే పాత్రను పోషిస్తున్న విషయాన్ని ఈ టీమ్ తెలియజేస్తూ .. ఆయనకి వెల్ కమ్ చెబుతూ ఒక పోస్టర్ ను వదిలారు.

'యు టర్న్' .. 'ఓ బేబీ' వంటి నాయికా ప్రధానమైన సినిమాలతో హిట్లు ఇచ్చిన సమంత, త్వరలో 'శాకుంతలం' సినిమాతో పలకరించనుంది. ఇక ఆ తరువాత సినిమాగా ఆమె చేస్తున్న 'యశోద' కూడా ఆమె కెరియర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.