Begin typing your search above and press return to search.

అయ్యో పాపం.. ఈ తెలుగమ్మాయి అన్‌ లక్కీ!

By:  Tupaki Desk   |   23 Jun 2022 12:30 AM GMT
అయ్యో పాపం.. ఈ తెలుగమ్మాయి అన్‌ లక్కీ!
X
సుహాస్‌ హీరోగా నటించిన కలర్ ఫోటో సినిమాలో హీరోయిన్ గా నటించిన తెలుగమ్మాయి ఛాందిని చౌదరి. ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ఎదగడం కష్టం.. అసాధ్యం అంటూ అభిప్రాయం ఉన్న సమయంలో ఛాందిని చౌదరి ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కెరీర్‌ ఆరంభం నుండి కూడా చాలా చక్కని పాత్రల్లో నటించి మెప్పించింది.

స్కిన్‌ షో కు దూరంగా ఉంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేసే విధంగా నటించడం ఈ అమ్మడి తీరు. వెబ్‌ సిరీస్ ల్లో కూడా ఈ అమ్మడు నటించి మెప్పించింది. ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటించింది. హీరోయిన్ గా ఈ అమ్మడు మెల్ల మెల్లగా అడుగులు వేస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ అమ్మడు తాను మిస్ చేసుకున్న ప్రాజెక్ట్‌ లను గురించి చెప్పుకొచ్చింది.

హీరోయిన్ గా ఛాందిన చౌదరికి కెరీర్‌ ఆరంభంలో ఊహలు గుసగుసలాడే సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. సినిమా లో నటించాల్సిందిగా మేకర్స్ అడిగిన సమయంలో కాస్త సమయం కావాలని కోరిందట.

ఆ తర్వాత స్పందించకపోవడంతో ఆ సినిమాతో రాశి ఖన్నాను హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం జరిగింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

ఊహలు గుసగుసలాడే సినిమా మాత్రమే కాకుండా ఈమె వద్దకు కుమారి 21ఎఫ్‌ సినిమా ఆఫర్ కూడా వచ్చిందట. సుకుమార్‌ శిష్యుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఒక బోల్డ్‌ గర్ల్‌ కథను చక్కగా చూపించిన ఆ సినిమా లో కూడా ఛాందిని చౌదరికి ఆఫర్‌ వచ్చిందట. కాని ఆ సినిమా కు కూడా ఛాందిని ఓకే చెప్పకుండా సున్నితంగా తిరష్కరించిందట. రెండు ప్రాజెక్ట్‌ లు కూడా మంచి విజయాలను సొంతం చేసుకుంది.

కెరీర్‌ ఆరంభంలో రెండు పెద్ద ప్రాజెక్ట్‌ లను వదిలేసిన ఈ అమ్మడు ఇప్పుడు మంచి ఆఫర్లు దక్కించుకుంటూ కెరీర్‌ లో ముందుకు సాగుతుంది. హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో వెబ్‌ సిరీస్ ల్లో మరియు పెద్ద సినిమా ల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడం ద్వారా ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఇక ఈ అమ్మడు సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉంటుంది.