Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ భార్యలో ఆ టాలెంట్ ఉంది!
By: Tupaki Desk | 9 July 2018 10:07 PM ISTమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య ....అడపాదడపా కొన్ని ఫంక్షన్లలో కనిపించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ భార్యగా...సిరివెన్నెల సీతారామశాస్త్రి బంధువుగా.... ఓ సెలబ్రిటీగా మాత్రమే ఆమె ప్రపంచానికి తెలుసు. అయితే, ఆమెలో ఓ కళాకారిణి దాగుందన్న సంగతి మాత్రం అతి కొద్ది మందికే తెలుసు. సౌజన్య ఓ భరత నాట్య కళాకారిణి అని టాలీవుడ్ లో కూడా చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో తాజాగా - సౌజన్య ఇచ్చిన భరత నాట్య ప్రదర్శన ఆహూతులను విపరీతంగా ఆకట్టుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ - ఆయన భార్య లెజినోవా...ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.
త్రివిక్రమ్, పవన్ లకు మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. వీరిద్దరూ మంచి స్నేహితులే కాక....బకరికి ఒకరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బయట ఫంక్షన్లకు పెద్దగా హాజరు కాని పవన్...సౌజన్య భరత నాట్య ప్రదర్శనకు సతీ సమేతంగా హాజరై సందడి చేశారు. నా చెల్లెలు సౌజన్య కోసం ఈ కార్యక్రమానికి వచ్చానని పవన్....ఆమెను సోదర సమానురాలిగా అభివర్ణించడం విశేషం. ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ తో పాటు సౌజన్య మామయ్య అయిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి కూడా హాజరయ్యారు.