Begin typing your search above and press return to search.
సుశాంత్ కేసులో అనుకోని ట్విస్ట్.. హత్యపై సీబీఐకి దొరకని ఆధారాలు
By: Tupaki Desk | 2 Sept 2020 12:00 PM ISTబాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14 న ముంబైలోని బాంద్రాలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన మరణం వివాదాస్పదంగా మారింది. మొదట్లో ఆయనది ఆత్మహత్య అని అంతా భావించినా.. కాదు హత్య అని ఆ తర్వాత పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో బీహార్ రాష్ట్ర విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. ప్రస్తుతం సీబీఐ సుశాంత్ మరణంపై విచారిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి సహా పలువురు అనుమానితుల వద్ద నుంచి అధికారులు వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు సంబంధించి రీ కంట్రక్షన్ చేసి పరిశీలించారు. అయితే ఈ కేసులో సుశాంత్ హత్య జరిగినట్లు ఎక్కడా తమకు ఆధారాలు లభించలేదని ముగ్గురు సీబీఐ అధికారులు వెల్లడించారు.
సుశాంత్ మరణంపై విచారణ మొదలుపెట్టిన సీబీఐ అధికారులు ముందుగా రియా చక్రవర్తి సహా అనుమానితులను విచారించారు. అన్ని సాక్ష్యాలు, ఫోరెనిక్స్ నివేదికలను పరిశీలించారు. అయితే సుశాంత్ హత్యకు గురైనట్లుగా వారికి ఎటువంటి ఆధారాలు, క్లూస్ లభించలేదు. కూపర్ ఆస్పత్రిలో సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన సమయంలో అతడి శరీరంపై రెండు గాయాలు చూసినట్లు ఓ వ్యక్తి పేర్కొన్న సంగతి తెలిసిందే.అయితే అతడు వైద్యుడు కూడా కాదు. ప్రముఖులు మరణించినప్పుడు అంత్యక్రియలకు హాజరయ్యే వ్యక్తి మాత్రమే. అతడికి పోస్టుమార్టం గురించే తెలియదని తెలిసింది. కాగా కొన్ని నెలల కిందట సుశాంత్, రియా థాయిలాండ్ ట్రిప్ కి వెళ్లారు. ఆ సమయంలో అతడు రూ.70 లక్షలు ఖర్చు పెట్టాడు. మరో హీరోయిన్ సారా అలీఖాన్ ను ట్రిప్ కి రప్పించేందుకు ఏకంగా చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేశాడు. అయితే ఈ విషయాన్నీ రియా విచారణలో బయటకు చెప్పలేదు. ఈ నేపథ్యంలో రియాకు కొందరు మద్దతుగా కొందరు నిలిచారు. ఆమె కుటుంబం విపరీతంగా విమర్శలు ఎదుర్కొంటోందని, రియా దోషి అని న్యాయస్థానం తేల్చలేదని అప్పటివరకు ఆమెను, ఆమె కుటుంబాన్ని స్వేచ్ఛగా ఉండనివ్వాలని బాలీవుడ్ నటి విద్యాబాలన్, తాప్సి, మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.