Begin typing your search above and press return to search.

రామ్ గోపాల్ వ‌ర్మ కు ఊహించ‌ని షాక్‌

By:  Tupaki Desk   |   6 April 2022 5:26 AM GMT
రామ్ గోపాల్ వ‌ర్మ కు ఊహించ‌ని షాక్‌
X
సంచ‌ల‌నాల‌కు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారిన ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. గ‌త కొంత కాలంగా ద‌ర్శ‌కుడిగా ప‌ట్టుకోల్పోయిన వ‌ర్మ త‌న స్థాయిని త‌గ్గించే బీగ్రేడ్ చిత్రాల‌ని తెర‌కెక్కిస్తూ వివాదాలు సృష్టిస్తున్నారు. తాజాగా ఆయ‌న లెస్బియ‌న్ ల స్టోరీతో తెర‌కెక్కించిన చిత్రం 'డేంజ‌ర‌స్‌'. నైనా గంగూలీ, అప్స‌ర రాణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం ఏప్రిల్ 8న దేశ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమా విష‌యంలో తాజాగా రామ్ గోపాల్ వ‌ర్మ‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది.

ఇద్ద‌రు లెస్బియ‌న్ ల క‌థ‌గా వ‌ర్మ అత్యంత వివాదాస్ప‌దంగా తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌డానికి దేశ వ్యాప్తంగా మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్స్ చైన్ ని క‌లిగి వున్న‌ పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ థియేట‌ర్స్ నిరాక‌రించాయి. అంతే కాకుండా ఇలాంటి చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌లేమ‌ని తీవ్ర అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశాయి. గ‌త కొంత కాలంగా ద‌ర్శ‌కుడిగా సంచ‌ల‌నాలు సృష్టిస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నా రామ్ గోపాల్ వ‌ర్మ‌కు ఇది గ‌ట్టి ఎదురుదెబ్బ‌గా మారింది.

దీంతో పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ థియేట‌ర్స్ వారిని విమ‌ర్శిస్తూ వ‌ర్మ సోషల్ మీడియా వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

త‌ను రూపొందించిన 'డేంజ‌ర‌స్‌' చిత్రాన్ని పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ థియేట‌ర్స్ వింగ్ ప్ర‌ద‌ర్శించ‌డానికి తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయ‌ని వ‌ర్మ పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ మూవీ ప‌ట్ల వారు వ్య‌వ‌హ‌రించిన తీరు అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు తీర్పునే స‌వాలు చేసేలా వుంద‌న్నారు.

'నేను రూపొందించిన‌ 'డేంజ‌ర‌స్' సినిమా లెస్బియ‌న్ క‌థాంశం అని దాన్ని ప్ర‌ద‌ర్శించ‌డానికి నిరాక‌రించ‌డం సుప్రీం కోర్టు తీర్పుని వ్య‌తిరేకించ‌డ‌మే అవుతుంది. సెన్సార్ బోర్డు ఆమోదించిన త‌ర్వాత కూడా వ్య‌తిరేకించ‌డం ఎల్ జీబిటీ క‌మ్యూనిటీకి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే. అంటే పీవీఆర్‌, ఐనాక్స్ థియేట‌ర్స్ యాజ‌మాన్యాలు ఎల్ జీబిటీ వ్య‌తిరేకిస్తున్నారు. కాబ‌ట్టి క‌మ్యూనిటీ మాత్ర‌మే కాకుండా ప్ర‌తి ఒక్క‌రూ వారి నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తార‌ని ఆశిస్తున్నా' అని వ‌ర్మ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.

వ‌ర్మ సినిమాకు పీవీఆర్‌, ఐనాక్స్ థియేట‌ర్ల యాజ‌మాన్యాలు గ‌ట్టి ఝ‌ల‌క్ ఇవ్వ‌డం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌ర్మ క్మ్యూనిటీని ఈ వివాదంలోకి లాగ‌డం తో పీవీఆర్‌, ఐనాక్స్ థియేట‌ర్స్ యాజ‌మాన్యాలు దీనిపై ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి అంటున్నాయి సినీ వ‌ర్గాలు. భార‌తీయ సంస్కృతికి వ్య‌తిరేకంగా వున్న ఈ చిత్రాన్ని రిలీజ్ టైమ్ వ‌ర‌కు ఎంత మంది ఆద‌రిస్తారో? ఎంత మంది వ్య‌తిరేకిస్తారో వేచి చూడాల్సిందే.