Begin typing your search above and press return to search.

స‌మంత‌తో వాళ్ల‌కు ఊహించ‌ని చిక్కులు

By:  Tupaki Desk   |   8 Oct 2021 2:00 PM IST
స‌మంత‌తో వాళ్ల‌కు ఊహించ‌ని చిక్కులు
X
అంతా బావుంటే ఓకే. డిఫ‌రెన్సెస్ వ‌స్తేనే స‌మ‌స్య‌. నాగ‌చైత‌న్య‌తో స‌మంత డిఫ‌రెన్సెస్ అటుపై విడాకుల నిర్ణ‌యం కొన్ని బ్రాండ్ల‌కు కూడా ఇబ్బందిక‌రంగా మారింది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఈ త‌ర‌హా చిక్కుల‌ను ఎదుర్కొంటోంది.

విడాకుల ప్ర‌క‌ట‌న అనంత‌రం స‌మంత మీడియా గ్లేర్ కి దూరంగా ఉన్నారు. ఇంకొంత‌కాలం ఇదే ప‌రిస్థితి ఉంటుంది. దీనివ‌ల్ల‌ ప్రముఖ OTT ప్లాట్ ఫాం డిస్నీ+ హాట్ స్టార్ ఆందోళన చెందుతోంది. సమంత తదుపరి తమిళ చిత్రం కాతు వాకుల రెండు కాదల్ డైరెక్ట్-టు- OTT హక్కులను డిస్నీ+ హాట్‌స్టార్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్ సేతుపతి- నయనతార తోపాటు సమంత నటించారు. సాధారణంగా నయనతార తన సినిమాను ప్రమోట్ చేయదు. అయితే హాట్ స్టార్ సినిమాను దూకుడుగా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ సమంత మీడియాకు దూరంగా ఉండాలని భావిస్తే.. విజయ్ సేతుపతితో స‌రిపెట్టుకోవాలి. విజయ్ సేతుపతి వంటి బిజీ స్టార్ ఖచ్చితంగా ప్రమోషన్ ల కోసం ఎక్కువ సమయం కేటాయించలేరు. ఇది స‌ద‌రు ఓటీటీకి ఇబ్బందిక‌ర స‌న్నివేశ‌మ‌ని విశ్లేషిస్తున్నారు.

త‌మిళంలో త‌న గ్రాఫ్ ని మ‌రింత పెంచుకునేందుకు వివాదాల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు సమంత కూడా ఈ సినిమాని దూకుడుగా ప్రమోట్ చేయడానికి ఆసక్తి చూపింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌న్న ఆలోచ‌న‌తో అలా చేయాల‌నుకున్నా వీలుప‌డ‌లేదు.

విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన - కాథు వాకుల రెండు కాదల్. ఈ సినిమాలో సమంత- నయనతార సోదరీమణులుగా కనిపిస్తారని పుకార్లు వచ్చాయి. త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. స‌మంత‌ విడాకుల నిర్ణ‌యం ఇప్పుడు ప్ర‌చారం ప‌రంగా ప్రతిదీ మార్చేసింది. డైల‌మాల్ని క్రియేట్ చేసింది.