Begin typing your search above and press return to search.

ఇస్మార్ట్ ప్రేమ సంతకం - లిరికల్ వీడియో

By:  Tupaki Desk   |   29 Jun 2019 11:22 AM IST
ఇస్మార్ట్ ప్రేమ సంతకం - లిరికల్ వీడియో
X
పూరి జగన్నాధ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ల ఫస్ట్ టైం కాంబోలో రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ మూడో ఆడియో సింగల్ ఇందాకా రిలీజ్ చేశారు. మణిశర్మ స్వరకల్పనలో అనురాగ్ కులకర్ణి-రమ్య బెహెర గాత్రంలో కూల్ మెలోడీగా ఇది రూపొందింది. ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడూ ఉండిపో నుదిటిపై రాతలా ఉండిపో అని అబ్బాయి పాడితే ఉండిపో కళ్ళలో కాంతిలా ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా అంటూ అమ్మాయి బదులివ్వడం క్యాచీగా ఉంది . చాలా తేలికైన పదాలతో భాస్కరభట్ల రవికుమార్ అందించిన సాహిత్యం రిపీట్ మోడ్ లో వినడానికి ముఖమైన కారణాల్లో ఒకటిగా నిలుస్తోంది.

లిరికల్ వీడియోస్ ని బట్టి చూస్తే బీచ్ ఒడ్డున ఎవరు లేని ఏకాంతాన్ని హీరో హీరోయిన్లు రామ్ నిధి అగర్వాల్ ఎంజాయ్ చేస్తూ ప్రేమ లోకంలో మునిగి తేలడం హై లైట్ అవుతోంది. దానికి తోడు రామ్ చాలా మాస్ గా కనిపిస్తుండగా నిధి అగర్వాల్ హాట్ హాట్ అందాలతో ఫుల్ మీల్స్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. పూరి తన మార్క్ అండ్ స్టైల్ లో బీచ్ సాంగ్ ని పిక్చరైజ్ చేశారు. బిజినెస్ మెన్-టెంపర్ తరహాలో ఇదీ సిగ్నేచర్ సాంగ్ గా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి.

మెలోడీయస్ గా ఉన్నా చిత్రీకరణ మాత్రం స్పైసిగా ఉండటం ఉండిపో ఉండిపోలో ప్రధాన ఆకర్షణ. రామ్ నిధిల కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. మణిశర్మ మరోసారి తన మేజిక్ ని రిపీట్ చేశారు. ఒక్కోపాటతో అంచనాలు పెంచుకుంటూ పోతున్న ఇస్మార్ట్ శంకర్ దీంతో ఇంకో ప్రమోషన్ కొట్టేశాడు. జులై 18న విడుదల కాబోతున్న ఈ క్రేజీ మూవీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి