Begin typing your search above and press return to search.

WWE అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్

By:  Tupaki Desk   |   23 Jun 2020 12:30 AM GMT
WWE అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్
X
డబ్ల్యూడబ్ల్యూఈ.. ఈ రెజ్లింగ్ గేమ్ చూసే వారికి ఏడు అడుగుల ఆజాను బాహుడైన అండర్ టేకర్ ఎవరో బాగా తెలుసు. భారీ జులపాల జుట్టుతో.. భీకర కళ్లతో 30 ఏళ్లు డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్ లో అందరినీ అలరిస్తున్నాడు. తాజాగా తాను రిటైర్ అవుతున్నట్టు ప్రకటించి అందరు అభిమానులకు షాకిచ్చాడు.

తాను మరోసారి రెజ్లింగ్ రింగ్ లో అడుగుపెట్టాలనే కోరిక లేదని.. నేను సాధించింది ఏమీ లేదని.. ప్రస్తుతం ఆట మారిందని.. కొత్త వారి కోసం వైదొలుగుతున్నానని.. ఈ ప్రయాణం కళ్లు తెరిపించిందని అండర్ టేకర్ భావోద్వేగ వీడ్కోలు పలికారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

రెజ్లింగ్ లో తన ప్రయాణం ముగిసిందని అండర్ టేకర్ తెలిపారు. తన శ్రమకు దక్కిన ఫలాలను ఇక అస్వాదిస్తానని తెలిపారు.

ఇక డబ్ల్యూడబ్ల్యూఈ కూడా అండర్ టేకర్ రిటైర్ మెంట్ ను ధ్రువీకరించి అతడి ఫొటోలను షేర్ చేసింది. అండర్ టేకర్ చివరి మ్యాచ్ లో ఏజే స్టైల్ తో తలపడ్డాడు.

అండర్ టేకర్ రిటైర్ మెంట్ పై ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్ స్పందించింది. కెప్టెన్ రోహిత్ శర్మ డబ్ల్యూడబ్ల్యూఈ బెల్ట్ పట్టుకొని ఉన్న ఫొటోను షేర్ చేయించి అతడి 30 ఏళ్ల కెరీర్ ముగిసిందని అలరించినందుకు థ్యాంక్యూ అంటూ వీడ్కోలు పలికింది.