Begin typing your search above and press return to search.

ఐశ్వర్య అభిమానులకు దిమ్మదిరిగే షాక్

By:  Tupaki Desk   |   5 Dec 2016 3:27 PM GMT
ఐశ్వర్య అభిమానులకు దిమ్మదిరిగే షాక్
X
సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు బతికుండగానే చనిపోయారు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ ను సోషల్ మీడియా ఇప్పటికే చాలాసార్లు బతికుండగానే చంపేసింది. మన కమెడియన్ ఎమ్మెస్ నారాయణ చనిపోకముందే ఆయన మృతి గురించి వార్తలు ప్రచారం చేశారు. ఇంకా చాలామంది సెలబ్రెటీల గురించి ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరిగాయి. ఐతే వాళ్లందరూ చాలా వరకు వయసు మళ్లిన వాళ్లే కాబట్టి సరిపోయింది. కానీ మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ గురించి కూడా ఇలాంటి ప్రచారం సాగించడమే విడ్డూరం. ఐశ్వర్యారాయ్ ఆత్మహత్య చేసుకుందంటూ సోషల్ మీడియాలో సాగిన ప్రచారం ఆమె అభిమానుల్ని విస్మయానికి గురి చేసింది.

ఐశ్వర్య ఆత్మహత్య అంటూ అల్లిన కథ కూడా జనాలు ఇది నిజమేమో అని కంగారు పడేలా చేసింది. ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమాలో ఐశ్వర్య.. రణబీర్ కపూర్ తో కలిసి హాట్ హాట్ రొమాన్స్ చేయడం ఆ మధ్య తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయంలో ఐశ్వర్య అత్తయ్య జయా బచ్చన్ చాలా సీరియస్ అయిందని.. ఈ వ్యవహారం బచ్చన్ కుటుంబంలో అభిప్రాయ భేదాలకు దారితీసిందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో గొడవ పెద్దదవడంతో ఐశ్వర్య మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ వార్త ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా పాకడంతో కలకలం రేగింది. ఐతే ఈ దుష్ప్రచారం మరింత ఎక్కువ కాకుండా ఐశ్వర్య అడ్డుకట్ట వేసింది. తన భర్త అభిషేక్ తో కలిసి ముంబయిలో ఒక ఫ్యాషన్ షోలో ఐశ్వర్య పాల్గొని తన గురించి వస్తున్న వార్తలకు తెరదించింది. దీంతో ఐశ్వర్య అభిమానులు హమ్మయ్య అనుకున్నారు.