Begin typing your search above and press return to search.

వీడియో సాంగ్: అల్ట్రా స్టైలిష్ తిమ్మ‌రుసు అద‌ర‌గొట్టాడుగా

By:  Tupaki Desk   |   17 July 2021 5:32 AM GMT
వీడియో సాంగ్: అల్ట్రా స్టైలిష్ తిమ్మ‌రుసు అద‌ర‌గొట్టాడుగా
X
తిమ్మ‌రుసు అన్న టైటిల్ తోనే స‌త్యదేవ్ అండ్ టీమ్ క్యూరియాసిటీ పెంచారు. టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఎంపిక చేసుకున్న పాత్ర క‌థాసంవిధానం ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దార‌ని ఇప్ప‌టికే రిలీజైన పోస్ట‌ర్లు టీజ‌ర్లు వ‌గైరా నిరూపించాయి. జూలై 30న థియేట్రిక‌ల్ గా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ మూవీ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ వైర‌ల్ గా మారుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి స్టైలిష్ సాంగ్ ప్ర‌మో రిలీజైంది.

`ది తిమ్మరుసు...` అంటూ సాగే ప్రోమో సాంగ్ ఆద్యంతం అల్ట్రా రిచ్ లుక్ తో ఎంతో స్టైలిష్ కొరియోగ్ర‌ఫీతో అల‌రించింది. ప్రోమోలో స‌త్య దేవ్ క్లాసిక్ స్టెప్స్.. అత‌డి లుక్ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తున్నాయి. అలాగే షార్ట్ బాట‌మ్ తో ప్రియాంక జ‌వాల్క‌ర్ అల్ట్రా స్టైలిష్ లుక్ .. కిల్లింగ్ ఎక్స్ ప్రెష‌న్స్ ఈ పాట‌కు మ‌రింత అద‌న‌పు హంగును జోడించింద‌ని చెప్పాలి. ఇక ఈ పాట‌లో బ్ర‌హ్మాజీ అండ్ క‌మెడియ‌న్ టీమ్ ఫ‌న్ ఎలిమెంట్ ఎంతో క‌నెక్టింగ్ గా డిజైన్ చేసారు కొరియోగ్రాఫ‌ర్స్ బృందం. ఇక వైట్ ష‌ర్ట్ పై స్టైలిష్ కోట్ తో కాస్ట్యూమ్ డిపార్ట్ మెంట్ చక్క‌గా ప‌ని చేసింద‌ని చెప్పాలి. ఇక టైటిల్ పాట‌లో స‌త్య శోధ‌న అంశాన్ని పెప్పీగా ఎలివేట్ చేసింది చిత్ర‌బృందం.. శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల మ్యూజిక్ లో గ్రేస్ ప్ర‌త్యేకంగా ఆక‌ర్షించింది.

అజయ్ ఇందులో ఓ కీల‌క పాత్ర‌ధారి. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య స‌క్సెస్ త‌ర్వాత సత్యదేవ్ మ‌రింత జోష్ తో క‌నిపిస్తున్నారు. మ‌రో హిట్ కొడ‌తారనే ఆశిద్దాం. ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్- ఎస్ ఒరిజినల్స్ ఆధ్వర్యంలో య‌ర‌బోలు స్రుజన్ నిర్మిస్తున్నారు.