Begin typing your search above and press return to search.

టాప్ యాంకర్ ని ఇన్సల్ట్ చేసిన సింగర్

By:  Tupaki Desk   |   28 Aug 2016 11:00 PM IST
టాప్ యాంకర్ ని ఇన్సల్ట్ చేసిన సింగర్
X
టాప్ యాంకర్ ఉదయభాను దాదాపు ఓ ఏడాదిగా ఎక్కడా కనిపించకపోయే సరికి.. యూఎస్ వెళ్లిపోయిందని.. యాంకరింగ్ కి దూరమైపోయిందని రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే తను ప్నెగ్నెంట్ కావడంతోనే బ్రేక్ తీసుకన్నట్లు ఉదయభాను ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తనకు ఇండస్ట్రీలో స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయని.. అయితే పరిశ్రమలో ఫ్రెండ్స్ మాత్రం తక్కువే అంటున్న ఈమె.. ఓ సింగర్ తనను అవమానించిన సంఘటన గురించి వివరించింది.

యూఎస్ లో ఓ ప్రాగ్రామ్ చేసినపుడు.. ఓ ఫేమస్ టాలీవుడ్ సింగర్ ఉదయభానును అవమానించిందట. సదరు సింగర్ ను స్టేజ్ మీదకు పిలిచేటపుడు ఉదయభాను ఆమె గురించి ఎంతో గొప్పగా చెప్పేదట. కానీ ఆఖరి రోజున మాత్రం.. సదరు సింగర్ తనే ముందు స్టేజ్ పైకి వెళ్లి.. తరువాత ఉదయభానును పిలుస్తానని చెప్పిందట.

''అందరినీ స్టేజ్ మీదకు పిలిచినా.. నన్ను మాత్రం పిలువలేదు. చివరకు యాంకర్స్ మీద ఒక కమెడియన్ గ్యాంగ్ ఏదో స్కిట్ వేశారు. అప్పుడు వాళ్ళు నన్ను స్టేజీ మీదకు పిలిచారు. ఇంతలో ఆ సింగర్ తరుపున వచ్చిన ఆర్కెస్ర్టా వారు.. నేను స్టేజెక్కుతుండగా ఒక నీరసం ట్యూన్ ను బ్యాగ్రౌండ్ లో ప్లే చేసి ఇంకా ఇన్సల్ట్ చేశారు'' అని చెప్పింది. ''ఆ సమయంలో నేనే స్టేజ్ పైకి వెళ్లి.. మళ్లీ మళ్లీ నాకు అమెరికా రావాలని లేదు అని చెప్పాను. అంతే కాదు.. మీరే ఇండియా రండి. అక్కడ మీకోసం ఓ వ్యక్తి ఎదురుచూస్తున్నారు. ఆమె మీ అమ్మ'' అని నేను అనడంతో ఆడిటోరియం అంతా దద్దరిల్లిపోయింది. అప్పుడా సింగర్ ''నిన్ను పిలుద్దామనే అనకుంటున్నా.. అంటూ ఏవోవో చెప్పింది. నేను పట్టించుకోలేదు'' అని చెప్పింది ఉదయభాను.

మొత్తానికి ఇటువంటి ఇన్సల్టులో తన లైఫ్‌ లో చాలానే ఉన్నాయట. అందుకే ఇండస్ర్టీ బయట తనకు చాలామంది స్నేహితులు ఉన్నారు కాని.. ఇండస్ర్టీలో మాత్రం లేరట.