Begin typing your search above and press return to search.
కోట్ల ఆస్తులున్నాయి... ఉదయ్ కిరణ్ ఆస్తులపై శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 10 April 2020 11:30 AM ISTటాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ మృతి చెంది ఆరు సంవత్సరాలు అయినా కూడా ఏదో ఒక వార్త ఆయన గురించి మీడియాలో ఉంటూనే ఉంది. చిన్న వయసులోనే సూపర్ స్టార్ రేంజ్ కు వెళ్లి ఎగసి పడ్డ అల మాదిరిగా కిందికి పడిపోయిన ఉదయ్ కిరణ్ ఆర్థిక పరిస్థితులు.. సినిమాల్లో ఆఫర్లు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్న విషయం తెల్సిందే. అయితే మస్కట్ లో సెటిల్ అయిన ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి ఇన్నాళ్ల తర్వాత సోదరుడు ఉదయ్ కిరణ్ ఆస్తుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఉదయ్ కిరణ్ ఆర్థిక పరిస్థితుల కారణంగా చనిపోయినట్లుగా వచ్చిన వార్తలను ఆమె కొట్టి పారేసింది. మా అమ్మ నా సోదరుడికి నాలుగు కేజీల బంగారం దాదాపుగా 100 కేజీల వెండిని ఇచ్చింది. చాలా ఖరీదైన ప్రాంతంలో మూడు ఆస్తులు కూడా ఉదయ్ కిరణ్ కు ఉన్నాయంటూ శ్రీదేవి చెప్పుకొచ్చింది. అంత ఆస్తి ఉన్న ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోతాడని ఆమె ప్రశ్నిస్తుంది. అతడు ఖచ్చితంగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోలేదు. తన జీవితంలో ఎప్పుడు కూడా ఉదయ్ కిరణ్ ఆర్థిక పరమైన ఇబ్బందులు పడలేదు.
ఉదయ్ కిరణ్ మరణం పై అనుమానాలు.. ప్రశ్నలు ఉన్నాయంటూ శ్రీదేవి వ్యాఖ్యలు చేశారు. సోదరుడు చనిపోయిన తర్వాత అతడి భార్య విషిత మా ఫ్యామిలీ తో పూర్తిగా దూరం అయ్యింది. ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించినా కూడా కనీసం కాంటాక్ట్ అవ్వడం లేదు. ఉదయ్ చనిపోయిన తర్వాత అతడి ఆస్తి అంతా కూడా విషిత తీసుకుంది. బంగారం.. వెండితో పాటు ప్రాపర్టీస్ ను కూడా ఆమె తీసుకుంది.
ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించిన ప్రతి సారి ఏదో ఒక కారణం చెప్పి దొరకడం లేదంది. ఆమె ప్రవర్తనతో మాకు అనుమానాలు కలుగుతున్నాయి. అనేక ప్రశ్నలు మాకు తలెత్తుతున్నాయంటూ శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉదయ్ కిరణ్ చనిపోయిన ఆరు సంవత్సరాల తర్వాత శ్రీదేవి ఇలాంటి వ్యాఖ్యలతో మీడియా ముందుకు రావడంతో మరోసారి ఆయన మరణ వార్తలు మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. కొందరు ఆమెకు మద్దతుగా మాట్లాడుతూ ఉంటే కొందరు మాత్రం ఇన్నేళ్లు ఏం చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.