Begin typing your search above and press return to search.

ధూమ్ ఆలీ ఇంతగా మారిపోయాడే!

By:  Tupaki Desk   |   4 Oct 2017 1:12 PM GMT
ధూమ్ ఆలీ ఇంతగా మారిపోయాడే!
X
ధూమ్ సిరీస్.. భారతీయ సినిమా సత్తాను ఆధునిక కాలంలో చాటిన మూవీ సిరీస్ లో ఒకటి. ఈ సినిమాలకు ఓ స్పెషాలిటీ ఉంటుంది. ప్రతీసారి ధూమ్ విలన్ మారిపోతాడేమో కానీ.. హీరో పాత్రలో జై దీక్షిత్ గా అభిషేక్ బచ్చన్.. హీరో అసిస్టెంట్ పాత్రలో ఆలీ పాత్రలో ఉదయ్ చోప్రాలు ప్రతీ ధూమ్ మూవీలోను అలరించారు.

ఆయా సినిమాల్లో వీరు ఎంతటి ఫిట్ గా కనిపిస్తారో చెప్పాల్సిన పని లేదు. ఏళ్లు గడిచిపోతున్నా.. అదే ఫిట్నెస్ తో ఆకట్టుకుంటూ.. అలరిస్తున్నాడు ఉదయ్ చోప్రా. మొహబ్బతే నుంచి మొదలుపెట్టి చాలానే సినిమాల్లో నటించిన ఇతను.. ప్రస్తుతం సినిమాలకు కొంత దూరంగానే ఉంటున్నాడు. అయితే.. తాజాగా ఇతడిని అందరూ షాక్ తినేస్తున్నారు. ఇందుకు కారణం.. ఎప్పుడు చిజిల్డ్ మజిల్డ్ బాడీతో.. అత్యంత ఫిట్ అయిన దేహ ధారుడ్యంతో ఉండే ఉదయ్ చోప్రా.. ఒక్కసారిగా అతి లావుగా కనిపించేస్తున్నాడు. ఆ కండలు ఏమయ్యాయో ఫిట్నెస్ ఏమయిందో తెలీదు కానీ.. మరీ ఇంతగా కేవలం 5 నెలల వ్యవధిలోనే మారిపోవడం ఆశ్చర్యకరం.

గత కొంతకాలంగా నర్గీస్ ఫక్రీతో ఇతడు డేటింగ్ చేస్తున్నాడని అంటున్నారు. ఐదు నెలల క్రితం ఇద్దరూ కలిసి ఫ్లైట్ ఎక్కుతూ కెమేరా కళ్లకు చిక్కారు కూడా. అయితే.. ఇప్పుడు ఏకంగా ఇంత భారీగా ఆన్ స్క్రీన్ ఆలీ మారిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. నర్గీస్ ఫక్రీతో బ్రేకప్ కారణంగానే ఇలా మారాడనే టాక్ ఉంది కానీ.. ఇందుకు సంబంధించి.. కన్ఫర్మేషన్ ఏమీ లేదు.