Begin typing your search above and press return to search.

అయ్యో ఉదయభాను లేదా?

By:  Tupaki Desk   |   30 Sep 2017 7:01 AM GMT
అయ్యో ఉదయభాను లేదా?
X
ప్రస్తుత రోజుల్లో యాంక్సర్స్ కి కూడా అభిమానులు చాలానే పెరుగుతున్నారని చెప్పాలి. కొందరు మాటలతో ఆకర్షిస్తే మరి కొందరు వారి మాటలకు గ్లామర్ ను కూడా జోడించి కవ్విస్తున్నారు. యాంకర్స్ అంటే ఒకప్పుడు అందంగా ఉన్నా హాట్ గా కనిపించేవారు కాదు. కానీ ఇప్పుడు స్పైసి లుక్స్ తో బుల్లి తెరపైనే రచ్చ చేస్తున్నారు. అంతే కాకుండా సినిమాల్లోను ఘాటుగా కనిపించి ఇంకాస్త పాపులారిటీని పెంచుకుంటున్నారు.

అయితే ఒకప్పుడు ఉదయభాను కూడా ముందు బుల్లితెరపై చాలా సింపుల్ గా కనిపించి అందరిని తన మాటలతోనే ఆకర్శించేది. ఇక కొన్ని రోజుల తర్వాత సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా లీడర్ - జులాయి సినిమాలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ చాలా పాపులర్ అయ్యాయి. అయితే ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత సినీ ఫీల్డ్ కి బ్రేక్ ఇచ్చింది. ఇన్ని రోజులు ఫ్యామిలీ లైఫ్ తో హ్యాపీగా ఎంజాయ్ చేసిన ఆమె ఇక మళ్లీ తన గత వైభవాన్ని చూపించడానికి ఫిక్స్ అయ్యింది.

ఇప్పటికే ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించబోతున్నడ్యాన్స్ షోకి యాంకర్ గా సెలెక్ట్ అయిన ఉదయబాను. మళ్లీ స్పెషల్ సాంగ్స్ కూడా చేయడానికి రెడీ అయ్యింది. గత కొన్ని రోజులుగా త్రివిక్రమ్ రాబోయే సినిమాలో ఉందని అందరు అనుకున్నారు. కానీ ఆ సినిమాలో అమ్మడు లేదని తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ -పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ అయిపోయాక ఎన్టీఆర్ తో సినిమాను చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఉదయభాను మెరవనుందని టాక్.