Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ ను క‌లిసిన ఉద‌య‌భాను!

By:  Tupaki Desk   |   30 Aug 2017 1:37 PM GMT
సీఎం కేసీఆర్ ను క‌లిసిన ఉద‌య‌భాను!
X
గ‌తంలో బుల్లితెర‌పై టాప్ యాంక‌ర్ల‌లో ఒకరిగా వెలుగొందిన న‌టి ఉద‌య‌భాను కొద్ది రోజులుగా క‌నుమ‌రుగైంది. యాంక‌ర్ గా రాణించిన త‌ర్వాత ఆమె కొద్ది సినిమాల్లో కూడా న‌టించింది. లీడ‌ర్ - జులాయి చిత్రాల‌లో ఐటం సాంగ్స్ లో మెరిసింది. 2013లో వచ్చిన మ‌ధుమ‌తి అనే సినిమాలో లీడ్ రోల్ చేసింది. ఆ త‌ర్వాత మ‌రే సినిమాలో న‌టించ‌లేదు. గ‌త సంవ‌త్స‌రం ఉద‌య‌భానుకు క‌వ‌ల పిల్ల‌లు పుట్టారు. అందువ‌ల్లే ఆమె బ‌య‌ట క‌న‌బ‌డ‌డం లేదు. అయితే, ఈ రోజు ఉద‌య‌భాను.... తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను క‌లిసింది. ఈ విష‌యాన్ని ఆమె ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఈ రోజు తాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను క‌లిశాన‌ని ఉద‌య‌భాను త‌న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌ తో దిగిన ఫొటోల‌ను ఆమె పోస్ట్ చేసింది. 'దేశంలోని గొప్ప ధైర్య‌వంత‌మైన నాయ‌కుల‌లో ఒక‌రైన కేసీఆర్ గారిని క‌లిసినందుకు చాలా గ‌ర్వంగా ఉంది. మాకు, మా పిల్ల‌ల‌కు ఆయ‌న ఆశీర్వాదాలు ఎంతో విలువైన‌వి' అని ఉద‌య‌భాను పోస్ట్ చేసింది. ఉద‌యభాను క‌వ‌ల‌ పిల్లల తొలి పుట్టినరోజు వేడుక వ‌చ్చేనెల 3న హైద‌రాబాద్‌ లోని పార్క్ హయత్ హోటల్లో జరగనుంది. ఈ సంద‌ర్భంగానే ఆమె కేసీఆర్‌ ను క‌లిసి ఆ వేడుక‌కి రావాల్సిందిగా ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది.