Begin typing your search above and press return to search.

పవన్ మూవీలో ఉదయభాను ఐటెం?

By:  Tupaki Desk   |   27 Sep 2017 6:27 AM GMT
పవన్ మూవీలో ఉదయభాను ఐటెం?
X
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కాసింత స్లోగా అయినా.. పర్ఫెక్ట్ గానే రెడీ అయిపోతోంది. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది పొంగల్ పండుగ సందర్భంగా థియేటర్లలోకి వస్తుందనే విషయం యూనిట్ అధికారికంగానే చెప్పేసింది. ఈ సినిమాలో చాలానే సర్ ప్రైజులను ఆడియన్స్ కు ఇవ్వబోతున్నాడట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

రీసెంట్ గా త్రివిక్రమ్ తో ఉదయభాను కాసేపు మీటింగ్ కావడంపై కొత్త రూమర్స్ బయల్దేరాయి. పవన్-త్రివిక్రమ్ సినిమాలో ఉదయభానుతో ఓ ఐటెం సాంగ్ చేయించే అవకాశాలపై చర్చలు జరిగాయని అంటున్నారు. ఈమధ్య యాంకర్లతో ఐటెం సాంగ్స్ చేయించే కల్చర్ కూడా బాగానే ఊపందుకుంటోంది. పైగా ఉదయభాను కూడా ఈ మధ్యనే మళ్లీ యాంకరింగ్ స్టార్ట్ చేసింది. ఓ డ్యాన్స్ ప్రోగ్రాంను హోస్ట్ చేసేయనుంది. బతుకమ్మ పాటలో కూడా మెయిన్ అట్రాక్షన్ గా ఉదయభానునే నిలిచింది. ఇలాంటి సమయంలో ఉదయభానుతో ఐటెం సాంగ్ చేయిస్తే.. అది కచ్చితంగా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే పాయింట్ అవుతుందని భావించాడట త్రివిక్రమ్.

అదే విషయాన్ని ఈ హాట్ యాంకర్ కు కన్వే చేయడం.. గతంలో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే రూపొందిన జులాయి మూవీలో ఐటెం సాంగ్ చేసిన అనుభవం ఉండడంతో.. ఇప్పుడు కూడా ఒప్పేసుకుందని అంటున్నారు. అయితే.. ఉదయభాను ఐటెం సాంగ్ దాదాపు ఖాయమే కానీ.. ఇప్పుడు పవన్ తో రూపొందబోతోన్న సినిమాలో ఉంటుందా.. లేక మాటల మాంత్రికుడి మరుసటి సినిమా అయిన ఎన్టీఆర్ మూవీలో ఉంటుందా అనే విషయంపై క్లారిటీ రావాలంటే కాసింత టైం పడుతుంది.