Begin typing your search above and press return to search.

అవన్నీ వేరు.. అంతేగా ఉదయభాను?

By:  Tupaki Desk   |   8 April 2015 3:30 AM GMT
అవన్నీ వేరు.. అంతేగా ఉదయభాను?
X
ఫైరున్న యాంకర్‌ ఉదయభాను. బుల్లితెరకి సిసలైన గ్లామర్‌ తెచ్చిన ఈ భామ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు. ప్రస్తుతం ఉదయభాను స్పీడు మరోసారి పెరుగుతోంది. ఓవైపు బుల్లితెర కార్యక్రమాలతో హడావుడి చేస్తూనే, మరోవైపు ఆడియో వేదికలపై తళుకుబెళుకులు ప్రదర్శిస్తోంది. చూస్తుండగానే రెండు దశాబ్ధాలు తిరుగులేని యాంకర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది భాను.

ఇక నిన్ననే బన్ని-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లోని 'సన్నాఫ్‌ సత్యమూర్తి' ఆడియో సక్సెస్‌ వేదికను విజయవాడలో నిర్వహించారు. అక్కడ ఉదయభాను ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హుషారైన యాంకరింగుతో ఆకట్టుకుంది. ఆ క్షణంలో ఆంధ్రా కుర్రాళ్ల గుండెల్లో ఎలాంటి ప్రశ్నలు మెదిలి ఉంటాయి? తనని తాను తెలంగాణ శకుంతలగా అభివర్ణించుకున్న ఉదయభాను తెలంగాణలో వెనుకబడిన తరగతుల గురించి అప్పట్లో మాట్లాడింది. రాజకీయాల్లో పోటీ చేస్తానని ముందుకొచ్చింది. తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌లా కనిపించింది. ఇప్పుడేమో ఇలా ఆంధ్రా కుర్రాళ్ళతో ప్రోగ్రాం.. అదంతేనండీ.. పర్సనల్‌ అభిప్రాయాలు వేరు, ప్రొఫెషనల్‌ పనులు వేరు.. కాదంటారా?