Begin typing your search above and press return to search.
మైత్రీ ..'మలయాళం' కోసం గ్రామీ విన్నర్!
By: Tupaki Desk | 21 Jun 2022 6:00 PM ISTటాలీవుడ్ లో వున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ కంపనీల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. 2015లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన `శ్రీమంతుడు` సినిమాతో ఈ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ తన జర్నీని ప్రారంభించింది. ఇయర్ ఇయర్ కి బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ మూవీస్ ని అందిస్తూ అనతి కాలంలోనే టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్రొడక్షన్ కంపనీగా పేరు తెచ్చుకుంది. సూపర్ స్టార్ ల నుంచి చిన్న హీరోల వరకు అందరితోనూ సినిమాలు నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సంస్థ చేతిలో దాదాపు ఏడుకు పైగా సినిమాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ స్టర్ కిరణ్ అబ్బవరం వరకు మైత్రీ సంస్థ సినిమాలని నిర్మిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి విడుదల కూడా చేసేసింది.
సూపర్ స్టార్ మహేస్ బాబుతో చేసిన `సర్కారు వారి పాట` ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొంత మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ తరువాత నేచురల్ స్టార్ నాని హీరోగా `అంటే సుందరానికి` పేరుతో ఓ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని నిర్మించారు. జూన్ 10న విడుదలైన ఈ మూవీ పరిస్థితి కూడా అలాగే వుంది.
ఈ రెండు చిత్రాలని ఇప్పటికే విడుదల చేసిన మైత్రీ సంస్థ ప్రస్తుతం ఏడు చిత్రాలని నిర్మిస్తూ యమ బిజీ బిజీగా వుంది. ఇలా ఈ ఏడాది ఏడు క్రేజీ ప్రాజెక్ట్ లని నిర్మిస్తున్న ఏకైక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కావడం విశేషం. ఇదిలా వుంటే ఈ సంస్థ ఈ ఏడాది సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలతో ఏక కాలంలో రెండు భారీ చిత్రాలని నిర్మిస్తోంది. ఇవి ప్రస్తుతం నిర్మాణ దశలో వున్నాయి. ఇదిలా వుంటే ఇదే ఏడాది ఈ సంస్థ మలయాళంలోనే అడుగుపెడుతున్నట్టుగా తెలుస్తోంది.
`మిన్నాల్ మురళి` ఫేమ్ టివినో థామస్ నటిస్తూ టివినో థామస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.బిజు రూపొందిస్తున్న మూవీ `అద్రిశ్య జలకంగల్`. రాధికా లావు నిర్మిస్తున్న ఈ మూవీకి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తూ మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది మైత్రీ సంస్థ. ఈ మూవీకి రెండు సార్లు గ్రామీ అవార్డ్ విన్నర్ రికీ కేజు సంగీతం అందించబోతున్నాడు.
ఈ విషయాన్ని వెల్లడిస్తూ మైత్రీ మూవీ మేకర్స్ సంగీత దర్శకుడి ఫొటోని సినిమా టైటిల్ తో సహా ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట సందడి చేస్తోంది. మలయాళంలో మైత్రీ వారి ప్రయాణం తెలుగు సినిమాల తరహాలోనే అక్కడ కూడా సాఫీగా సాగనుందని తెలుస్తోంది.