Begin typing your search above and press return to search.

ఇద్దరు సూపర్‌ స్టార్స్ మల్టీ స్టారర్‌

By:  Tupaki Desk   |   17 Feb 2023 11:30 PM IST
ఇద్దరు సూపర్‌ స్టార్స్ మల్టీ స్టారర్‌
X
భాష ఏదైనా మల్టీ స్టారర్‌ సినిమా అంటే ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇద్దరు సూపర్‌ స్టార్స్‌ కలిసి నటిస్తే ఆ సినిమా రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి సూపర్ స్టార్స్ మల్టీ స్టారర్ సినిమాను హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

షారుఖ్ ఖాన్ తో పఠాన్ సినిమాను నిర్మించిన యశ్ రాజ్ ఫిల్మ్స్ లోనే మరో భారీ యాక్షన్ మల్టీ స్టారర్‌ రాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే యశ్‌ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌ లో టైగర్‌ చిత్రం వచ్చింది.

సల్మాన్ ఖాన్‌ హీరోగా నటించిన టైగర్ ఫ్రాంచైజీ లో వరుసగా సినిమాలను ఆదిత్య చోప్రా ప్లాన్‌ చేస్తున్నాడు.

అందులో భాగంగానే సల్మాన్‌ ఖాన్‌ మరియు షారుఖ్ ఖాన్‌ లతో సినిమాను ప్లాన్‌ చేస్తున్నట్లుగా బాలీవుడ్‌ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలు అయ్యిందట. సల్మాన్ మరియు షారుఖ్‌ ఖాన్ లకి యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌ తో మంచి అనుబంధం ఉంది.

ఈ భారీ మల్టీ స్టారర్‌ కు శ్రీధర్ రాఘవన్‌ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. కేవలం హిందీ మార్కెట్‌ కు అనుగునంగా కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉండబోతుందని యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ వారు అంటున్నారు. ఈ మల్టీ స్టారర్‌ వర్కౌట్‌ అయితే అద్భుతమే అన్నట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.