Begin typing your search above and press return to search.

రెండు భాగాల `మనీ హీస్ట్` సంథింగ్ స్పెష‌ల్ గా!

By:  Tupaki Desk   |   14 Feb 2021 1:30 PM GMT
రెండు భాగాల `మనీ హీస్ట్` సంథింగ్ స్పెష‌ల్ గా!
X
ప్ర‌ఖ్యాత స్ట్రీమింగ్ దిగ్గ‌జం నెట్ ‌ఫ్లిక్స్ గొప్ప ఒరిజిన‌ల్ కంటెంట్ తో ప్ర‌పంచంలోనే అగ్ర‌గామిగా దూసుకెళుతోంది. ఇందులో ప్రసారమయ్యే సూపర్ హిట్ టీవీ సిరీస్ ల‌లో మనీ హీస్ట్ ఒకటి. స్పానిష్ హీస్ట్ క్రైమ్ డ్రామాను స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌లో ఆంగ్లంలో డబ్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఇది నాలుగు సీజన్లలో లభిస్తుంది. ఈ బృందం ప్రస్తుతం సిరీస్ ఐదవది చివరి భాగాన్ని చిత్రీకరిస్తోంది. అలెక్స్ పినా టీవీ సిరీస్ ను సృష్టించ‌గా.. చివరి సీజన్ రెండు భాగాలుగా ప్రసారం చేస్తార‌ని తాజాగా ఊహాగానాలు సాగుతున్నాయి.

`మనీ హీస్ట్’ సిరీస్ కుప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. గ్రాండ్ ఫైనల్ అంచనాలకు తగ్గకుండా చూసుకోవడంలో సృష్టికర్తలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐదవ సీజన్ ఈ ఏడాది ఆగస్టులో స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ బృందాలు తాజా డెవ‌ల‌ప్ మెంట్ ని ధృవీకరించలేదు కాని ప్రొడ‌క్ష‌న్ యూనిట్ కు దగ్గరగా ఉన్న వర్గాలు అదే విషయాన్ని ధృవీకరించాయి.

ఫైనల్ రెండవ భాగం సమ్మర్ 2022 లో విడుదల కానుంది. నాల్గవ భాగం కోసం షూట్ పూర్తయిన తర్వాత టీమ్ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేయ‌నుంది. సిరీస్ మొదటి భాగం 20 డిసెంబర్ 2017 న.. రెండవ భాగం 6 ఏప్రిల్ 2018 న విడుదల కాగా.. మూడవ భాగం ఎనిమిది ఎపిసోడ్లతో 19 జూలై 2019 న విడుదలైంది. పార్ట్ 4 కూడా ఎనిమిది ఎపిసోడ్లతో విడుదల చేసారు. 3 ఏప్రిల్ 2020 న ఈ సిరీస్ విడుదలైంది.