Begin typing your search above and press return to search.

ఒకే రోజు ఒకే దర్శకుడి 2 సినిమాలు

By:  Tupaki Desk   |   12 March 2019 5:07 AM GMT
ఒకే రోజు ఒకే దర్శకుడి 2 సినిమాలు
X
చాలా అరుదుగా ఒకే హీరో లేదా దర్శకుడి రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం జరుగుతుంది. చాలా ఏళ్ళ క్రితం బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు-నిప్పు రవ్వ ఒకే తేదీకి రావడం అప్పట్లో పెద్ద సెన్సేషన్. దాని తర్వాత న్యాచురల్ స్టార్ నానికి ఇది అనుభవమయ్యింది. ఎవడే సుబ్రహ్మణ్యంతో జెండాపై కపిరాజు పోటీ పడింది. ఈ ఇద్దరి హీరోల కేసుల్లో ఒకటి సూపర్ హిట్ కాగా రెండోది డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఓ దర్శకుడికి అలాంటి అనుభవమే ఎదురు కాబోతోంది. అతనే ఏఎల్ విజయ్.

ఏప్రిల్ 12 విజయ్ తీసిన దేవి 2 రిలీజ్ కాబోతోంది. తెలుగు తమిళ్ లో గతంలో వచ్చిన అభినేత్రికి ఇది సీక్వెల్. డేట్ మొన్నే ప్రకటించారు. తమన్నా ప్రభుదేవా నందితా శ్వేతా తదితర తారాగణంతో హారర్ జానర్ లో దీని మీద ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. తెలుగు వెర్షన్ సైతం ఆ తేదీకే రావడం దాదాపు ఖరారే. దీంతో పాటు వాచ్ మ్యాన్ అనే విజయ్ మరో సినిమా కూడా ఏప్రిల్ 12నే లాక్ చేసుకుంది. సర్వం తాళ మయంతో ఇటీవలే హీరోగా పెర్ఫార్మన్స్ తో అదరగొట్టిన జివి ప్రకాష్ కుమార్ ఇందులో హీరో. కమెడియన్ యోగి బాబు కథానాయకుడికి సమానమైన కీలక పాత్ర చేస్తున్నాడు.

అనివార్య పరిస్థితుల వల్ల రెండు సినిమాలు ఒకే డేట్ కి విడుదల చేయాల్సి వస్తోందని విజయ్ ప్రకటించాడు. కాకతాళీయంగా రెండు మీడియం బడ్జెట్ సినిమాలు కావడం విశేషం. విజయ్ గత చిత్రం లక్ష్మి-కణంలు ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి. దేవి 2 తెలుగులో కూడా వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. వాచ్ మెన్ మాత్రం రిజల్ట్ ని బట్టి తెలుగులో డబ్ చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు