Begin typing your search above and press return to search.

నాని కోసం మరో ఇద్దరు కూడా కన్ఫర్మ్‌?

By:  Tupaki Desk   |   25 Jun 2020 4:20 PM IST
నాని కోసం మరో ఇద్దరు కూడా కన్ఫర్మ్‌?
X
నాని హీరోగా రాహుల్‌ సంక్రీత్యన్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. భారీ బడ్జెట్‌ తో ప్రతిష్టాత్మకంగా రూపొందబోతున్న ఈ చిత్రంకు సంబంధించిన మొదటి పోస్టర్‌ ఇప్పటికే వచ్చేసింది. సినిమా షూటింగ్‌ కూడా ఇప్పటి వరకు ప్రారంభించాల్సి ఉంది. కాని గత మూడు నెలలుగా షూటింగ్స్‌ జరగని కారణంగా నాని బ్యాలన్స్‌ ఉన్న సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. కనుక వచ్చే ఏడాది ఈసినిమాను పట్టాలెక్కించాలని దర్శకుడు నిర్ణయించాడు.

సినిమా షూటింగ్‌ ప్రారంభంకు చాలా సమయం ఉన్నా కూడా హీరోయిన్స్‌ విషయం లో అప్పుడే చర్చలు దాదాపు గా ముగించేశాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌ కనిపించబోతున్నారట. కథానుసారంగా ముగ్గురు హీరోయిన్స్‌ కూడా ఎవరికి వారే ప్రాముఖ్యతను కలిగి ఉంటారు. కనుక ముగ్గురిని కూడా నోటెడ్‌ హీరోయిన్స్‌ ను పెట్టాలని రాహుల్‌ భావిస్తున్నాడు. ఇప్పటికే సాయి పల్లవిని ఒక హీరోయిన్‌ గా ఖరారు చేశాడు. సాయి పల్లవి అధికారికం గా సైన్‌ చేయకున్నా కూడా తప్పకుండా నటిస్తానంటూ హామీ ఇచ్చిందట.

ఇక మరో హీరోయిన్‌ పాత్ర కోసం రష్మిక మందన్న ను సంప్రదించ గా ఆమె మరో హీరోయిన్‌ తో స్క్రీన్‌ షేరింగ్‌ కు నో చెప్పిందట. రష్మిక నో చెప్పడంతో రాహుల్‌ తాజాగా మరో ఇద్దరు ముద్దుగుమ్మలతో చర్చలు జరిపాడట. తమిళ స్టార్‌ విజయ్‌ తో నటించి మెప్పించిన మాళవిక మోహన్‌ మరియు గూడాఛారి చిత్రంలో నటించిన శోభిత ధూళిపాల లు ఇద్దరు కూడా నానికి జోడీగా దాదాపుగా కన్ఫర్మ్‌ అయినట్లే అంటూ టాక్‌ వినిపిస్తుంది. ఈ చిత్రం కోసం నాని చాలా విభిన్నమైన మేకోవర్‌ ను ట్రై చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.