Begin typing your search above and press return to search.

మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టిన 'ది కశ్మీర్ ఫైల్స్' మేకర్స్..!

By:  Tupaki Desk   |   11 April 2022 5:27 AM GMT
మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టిన ది కశ్మీర్ ఫైల్స్ మేకర్స్..!
X
'ది కశ్మీర్ ఫైల్స్' వంటి బ్లాక్ బస్టర్ అందించిన తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు ఐ యామ్ బుద్దా ప్రొడక్షన్స్ మరోసారి కలవబోతున్నారు. హ్యూమనిటీకి సంబంధించిన మరో రెండు గొప్ప, క్రూరమైన నిజాయితీ కథలను బిగ్ స్క్రీన్ మీదకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.

'ది తాష్కెంట్‌ ఫైల్స్‌' తర్వాత విలక్షణ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ''ది కాశ్మీర్ ఫైల్స్'' సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 1990లో కశ్మీర్ లోయలో జరిగిన దారుణలను అకృత్యాలను.. కశ్మీర్ పండిట్ల వలసల హృదయాన్ని కదిలించే కథనంతో ఈ చిత్రాన్ని రూపొందించారు.

'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖుల ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలో 250 కోట్ల క్లబ్ లో చేరి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ డెడ్లీ కాంబినేషన్ లో వచ్చే సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ - వివేక్ రంజన్ అగ్నిహోత్రి మరియు పల్లవి జోషి సంయుక్తంగా మరో రెండు చిత్రాలను నిర్మించడానికి రెడీ అయ్యారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా దీనిపై అధికారిక ప్రకటన విడుదలైంది. భారతీయ చరిత్రలో వెలుగులోకి రాని సత్యాల కోసం సిద్ధంగా ఉండండని పేర్కొంటూ అనౌన్స్ మెంట్ వీడియో వదిలారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఇకపోతే 'ది కాశ్మీర్ ఫైల్స్' నిర్మాతలు ఆ మధ్య 'ది ఢిల్లీ ఫైల్స్' అనే మరో వైవిధ్యమైన చిత్రాన్ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో జీవించే హక్కు గురించి చెప్పబోతున్నట్లు తెలిపారు. హిందీ మరియు పంజాబీ భాషలో రూపొందే ఈ చిత్రాన్ని 2022 అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు.