Begin typing your search above and press return to search.
'సలార్' లో ప్రభాస్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు..?
By: Tupaki Desk | 8 Dec 2020 11:11 AM ISTపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ - 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'సలార్' అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి దీనికి సంబంధించి డైలీ ఏదొక రూమర్ వస్తూనే ఉంది. తాజాగా 'సలార్' లో నటించబోయే హీరోయిన్ల విషయంలో ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ఇందులో ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారట.
'సలార్' లో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నటించనుందట. ఇందులో దిశా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనుందని అంటున్నారు. అలానే మరో లీడ్ రోల్ కోసం సారా అలీఖాన్ ని తీసుకునే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఏదేమైనా ప్రభాస్ 'సలార్' సినిమా పనులు వేగంగానే జరుగుతున్నాయి. ప్రస్తుతం 'కేజీఎఫ్ 2' సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్న ప్రశాంత్ నీల్.. 2021 జనవరిలో 'సలార్' చిత్రాన్ని ప్రారంభిస్తారు. ఇక అప్పటికి ప్రభాస్ కూడా 'రాధే శ్యామ్' సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. 'రాధే శ్యామ్' వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది.