Begin typing your search above and press return to search.
మళ్లీ మహేష్ డబుల్ ధమాకా
By: Tupaki Desk | 16 Oct 2016 5:00 PM ISTమహేష్ బాబు కెరీర్లో చాలా వరకు సింగిల్ హీరోయిన్ తోనే సినిమాలు చేశాడు. గత కొన్నేళ్లలో మహేష్ బాబు చేసిన చాలా సినిమాల్లో ఒక హీరోయినే ఉండటం గమనించవచ్చు. దూకుడు.. బిజినెస్ మ్యాన్.. 1 నేనొక్కడినే.. ఆగడు.. శ్రీమంతుడు.. ఇలా చాలా సినిమాల్లో సోలో హీరోయినే. ఐతే ఈ ఏడాది చేసిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో మాత్రం ఇద్దరు హీరోయిన్లకు చోటు దక్కింది. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న కొత్త సినిమాలో మాత్రం రకుల్ ప్రీత్ ఒక్కతే హీరోయిన్. ఐతే దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ చేయబోయే సినిమాలో మాత్రం ఇద్దరు హీరోయిన్లుంటారట.
కొరటాల చేసిన మూడు సినిమాల్లో ఒకదాంతో మాత్రమే సోలో హీరోయిన్. అది మహేష్ బాబుతో చేసిన శ్రీమంతుడు సినిమానే. తొలి సినిమా ‘మిర్చి’లో.. లేటెస్ట్ మూవీ ‘జనతా గ్యారేజ్’లో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం కల్పించాడు. ఈసారి మహేష్ కు జోడీగానూ ఇద్దరు హీరోయిన్లను పెడుతున్నాడట కొరటాల. మహేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలాగే దీన్ని కూడా తెలుగు.. తమిళ భాషల్లో తెరకెక్కిస్తారట. అందుకే హీరోయిన్లిద్దరినీ కూడా తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయం ఉన్నవాళ్లనే ఎంచుకోబోతున్నాడట కొరటాల. ప్రస్తుతం స్క్రిప్టు పనిలో బిజీగా ఉన్నాడు కొరటాల. డిసెంబర్లో నటీనటుల ఎంపిక జరుగుతుంది. జనవరిలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/