Begin typing your search above and press return to search.

ట్విట్టర్ వార్: మెగాస్టార్ ఫ్యాన్స్ vs పవర్ స్టార్ ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   11 May 2020 6:04 PM IST
ట్విట్టర్ వార్: మెగాస్టార్ ఫ్యాన్స్ vs పవర్ స్టార్ ఫ్యాన్స్
X
ఖాళీగా ఉండడం అనేది సగం అనర్థాలకు మూలం. ఎందుకంటే ఏమి పని లేనప్పుడు పని చేసే వాడిని కెలకడమే పనిగా పెట్టుకుంటారు కొందరు. ఇక లేనిపోని విమర్శలు చేసేది కూడా పని లేనప్పుడే. సోషల్ మీడియాలో అదేపనిగా సెలబ్రిటీలు యాక్టివ్ గా ఉండడానికి కారణం లాక్ డౌన్ పుణ్యమేనని కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఫ్యాన్స్ కూడా పని లేకుండా ఇంట్లో ఉండడంతో లేనిపోని కాంట్రవర్సీలు మొదలవుతున్నాయి అని అంటున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ మలుపు తిప్పిన సినిమాల్లో 'గబ్బర్ సింగ్' ఒకటి. ఈమధ్య ప్రతి సినిమాకు యానివర్సరీ లు జరుపుతున్నారు కదా.. ఈ సినిమా కూడా యానివర్సరీ వేడుకలకు సిద్ధమయ్యారు అభిమానులు. అయితే మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఈ మధ్య యాక్టివ్ గా ఉండటంతో ఆయన అభిమానులు చిరంజీవికి ఫుల్ గా మద్దతు ఇవ్వడమే కాకుండా ఇతర హీరోల ఫ్యాన్స్ పై కూడా దృష్టి సారిస్తున్నారు. ఎవరైనా చిరును విమర్శిస్తే వారిని ట్రోలింగ్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయిన సమయంలో చిరంజీవి రాజకీయాల్లోకి రావడం తో మెగాస్టార్ ఫ్రెండ్స్ అందరూ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ ఇచ్చారని.. ఆ సినిమాను హిట్ చేశారని అయితే సినిమా హిట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అటు మెగాస్టార్ ను.. ఇటు మెగా ఫ్యాన్స్ ను పక్కన పెట్టారని కొందరు మెగాస్టార్ అభిమానులు ఆరోపిస్తున్నారు.

అయితే ఈ కామెంట్స్ కు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న కొందరు పెద్దలు వీరందరూ ఒకే గొడుగు కింద ఉండే ఫ్యాన్స్ అనే వాస్తవాన్ని ఎప్పుడు గ్రహిస్తారో అప్పుడే ఇండస్ట్రీ ఒక దారిలో పడుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.