Begin typing your search above and press return to search.

ట్విట్టర్ మూమెంట్స్‌ లో సూపర్ స్టార్ మహేష్ బాబు..!

By:  Tupaki Desk   |   9 Aug 2021 8:32 AM GMT
ట్విట్టర్ మూమెంట్స్‌ లో సూపర్ స్టార్ మహేష్ బాబు..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు (ఆగస్టు 9) తన 46వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. దీని కోసం మూడు వారాల ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకున్న మహేష్ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేస్తున్నారు. కామన్ డీపీలు హ్యాష్ ట్యాగ్స్ తో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. మహేష్ పిలుపు మేరకు భారీగా మొక్కలు నాటుతూ ట్విట్టర్ లో సూపర్ స్టార్ ని ట్యాగ్ చేస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి అభిమానుల వరకూ అందరూ మహేష్ కు బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. ఈ క్రమంలో టైమ్‌ లైన్‌ లు మిలియన్ల కొద్దీ ట్వీట్‌ లతో నిండి పోయింది. ఈ తుఫానుకు తోడుగా వచ్చిన 'సర్కారు వారి పాట' టీజర్ అభిమానులు మరియు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 'సర్కారు వారి పాట' చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ 'సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్' విడుదల చేసిన సంగతి తెలిసిందే. 1:17 నిమిషాల ఈ వీడియోలోని సూపర్‌ స్టార్ స్వాగ్ - డైలాగ్‌ లు - యాక్షన్ - కెమెరా వర్క్ - బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ - ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతీది అందరినీ మంత్రముగ్దులను చేశాయి. ఇంతకముందు ఎన్నడూ చూడని సరికొత్త గెటప్ లో మహేష్ మరింత యంగ్ గా అందంగా కనిపించి ఫ్యాన్స్ ని ఫిదా చేసాడు. ఈ టీజర్ మిలియన్ల కొలదీ వ్యూస్ లైక్స్ తో యూట్యూబ్ ట్రెండ్స్ జాబితాలో నెం.1 స్థానంలో కొనసాగుతోంది.

సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు మరియు 'సర్కారు వారి పాట' చుట్టూ ఉన్న ఈ హంగామా ట్విట్టర్ దృష్టిని కూడా ఆకర్షించింది. సెలబ్రిటీల విషెస్ అన్నిటినీ ట్విట్టర్ ఒక లిస్ట్ లో పెట్టి, దానిని అధికారిక హ్యాండిల్ లో ట్విట్టర్ మూమెంట్స్ ఇండియాలో ఫీచర్ గా పోస్ట్ చేసింది. ఇన్స్టంట్ గా జరిగే అత్యుత్తమమైన వాటిని ట్విట్టర్‌ ఇలా ఫీచర్స్ గా పెడుతూ ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇకపోతే మహేష్ బాబుకు సంబంధించిన హ్యాష్‌ ట్యాగ్‌ లు #HBDMaheshBabu, #HBDSuperstarMaheshBabu, #KeerthySuresh, #SarkaruVaariPaata, #SSMB28 వంటివి ట్విట్టర్ ట్రెండ్స్  లిస్టులో సూపర్‌ స్టార్ మేనియాని సూచిస్తున్నాయి.