Begin typing your search above and press return to search.

#BIGGBOSS5TELUGU : ఆమె రీ ఎంట్రీ.. టాప్ లో ట్రెండ్‌

By:  Tupaki Desk   |   20 Oct 2021 5:37 AM GMT
#BIGGBOSS5TELUGU :  ఆమె రీ ఎంట్రీ.. టాప్ లో ట్రెండ్‌
X
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 వారాలు గడిచి పోతున్నాయి.. దాదాపుగా సగం సీజన్ పూర్తి అయ్యింది. కాని ఇప్పటి వరకు షో లో ఓ అదిరి పోయే ట్విస్ట్‌ లేదు.. ఓ వైల్డ్ ఎంట్రీ లేదు. లోబో ను సీక్రెట్‌ రూమ్‌ కు పంపినా కూడా పెద్దగా ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు. ఆయన నేటి ఎపిసోడ్‌ లో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. అయినా కూడా పెద్దగా ప్రేక్షకులు సర్‌ ప్రైజ్ అయ్యే అవకాశం మాత్రం కనిపించడం లేదు. కాని లహరిని తిరిగి షో లోకి పంపించడం వల్ల ఖచ్చితంగా షో లో హడావుడి కనిపిస్తుందనే నమ్మకంను షో నిర్వాహకులు అంటున్నారు. పెద్ద ఎత్తున లహరికి ఉన్న అభిమానులు ఆమెను మళ్లీ షో కు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా ట్విట్టర్ లో లహరి మళ్లీ బిగ్‌ బాస్ హౌస్‌ లోకి వెళ్లాలి అనే హ్యాష్‌ ట్యాగ్‌ ను ఇండియా వైడ్‌ గా ట్రెండ్‌ చేశారు. లహరి కోసం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసినా కూడా ఆమె కొన్ని కారణాల వల్ల ఎలిమినేట్‌ అయ్యింది. కాని ఆమె ఎలిమినేట్‌ అవ్వాల్సిన కంటెస్టెంట్ కాదని చాలా మంది చాలా రకాలుగా అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే మళ్లీ లహరిని రీ ఎంట్రీ ఇప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున అంచనాలున్న లహరి ఎంట్రీ ఈ వారాంతంలో జరుగుతుందని కొందరు అంటూ ఉంటే బిగ్ బాస్ నిర్వాహకుల నుండి మాత్రం ఎలాంటి స్పష్టత కనిపించడం లేదు. ప్రముఖులు కూడా లహరి బిగ్‌ బాస్ లో ఉంటే బాగుంటుందనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు.

ఒక వేళ లహరి కనుక బిగ్ బాస్ లో రీ ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా తన ఆట స్టైల్‌ ను చూపించడం ఖాయం. బయటి విషయాలు అన్ని కూడా ఆమెకు తెలుసు కనుక ఖచ్చితంగా ఆమె అక్కడ ఎలా ఆడాలో ఆడుతుంది.. అక్కడి వారితో ఎలా ఆడాలో ఆడుకుంటుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఒక రీ ఎంట్రీ ఉండటం వల్ల ఖచ్చితంగా షో కు అదనపు ఆకర్షణ వస్తుంది. అలా అయినా కాస్త రేటింగ్ బాగా వస్తుందేమో చూడాలి. లహరి రీ ఎంట్రీ విషయమై స్టార్‌ మా నుండి ఎలాంటి క్లారిటీ అయితే లేదు. కాని ప్రస్తుతానికి లహరిని క్వారెంటైన్‌ లో ఉంచారంటూ మాత్రం వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో మరింత స్పష్టత వస్తుందేమో చూడాలి.