Begin typing your search above and press return to search.

టాస్కుల ట్విస్టులే కాదు.. బిగ్ బాస్ 6లో కొత్త నిర్ణయాలతో రచ్చ

By:  Tupaki Desk   |   8 Sep 2022 5:39 AM GMT
టాస్కుల ట్విస్టులే కాదు.. బిగ్ బాస్ 6లో కొత్త నిర్ణయాలతో రచ్చ
X
వారంలో నామినేషన్.. వారాంతంలో ఎలిమినేషన్.. వారానికి ఒకరు చొప్పున ఎలిమినేషన్.. ఇలాంటి రోటీన్ ఫార్మాట్లకు భిన్నంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు షో మీద కొత్త ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ కు సంబంధించి మొదట్లో సెలబ్రిటీలు.. స్టార్లు ఉంటూ ఆసక్తికరంగా మారేది. తర్వాతి కాలంలో ప్రముఖులు.. సెలబ్రిటీల స్థానంలో సోషల్ మీడియా సంచలనాలను తీసుకురావటం తెలిసిందే.

ఈ సారి చలాకీ చంటి.. శ్రీహాన్ మినహాయిస్తే.. బాగా ఫేమస్ అయిన వారే కనిపించని పరిస్థితి. ఇలాంటి వేళలో.. షో మీద మరింత ఆసక్తిని పెంచేందుకు వీలుగా బిగ్ బాస్ నిర్ణయాలు ఉంటున్నాయి.

కొత్తదనం చూపించాలనుకున్నారో ఏమో కానీ బిగ్ బాస్ తాజాగా కొత్త నిర్ణయాలతో హోరెత్తిస్తున్నాడు. ఇప్పటివరకు నామినేషన్స్ ను సోమవారం కాస్తా బుధవారానికి మార్చేశారు. అంతేకాదు.. వారానికి ఒకరు ఎలిమినేట్ చేసే దానికి భిన్నంగా ఇద్దరిని ఎలిమినేట్ చేయనున్నట్లు ప్రకటించి మరో భారీ షాక్ ఇచ్చాడు. ఈ సీజన్ లో జంటగా అడుగు పెట్టిన మెరీనా- రోహిత్ జంటగా నామినేషన్ లోకి వెళ్తారని.. ఒకవేళ ఎలిమినేట్ అయితే ఇద్దరూ కలిసే బయటకు వెళతారని పేర్కొనటంతో హౌస్ లోనే కాదు.. ప్రేక్షకుల్లోనూ ఉత్కంఠ పెంచే ప్రయత్నం చేశాడు.

గతంలో వరుణ్ సందేశ్ - వితిక దంపతులు కలిసి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినా.. ఎవరి ఆట వాళ్లు ఆడుకోవటం.. ఎవరి నామినేషన్ వారే చేసుకోవటం.. బయటకు వెళ్లాల్సిన వేళలోనూ ఎవరికి వారు విడిగా వెళ్లటం తెలిసిందే.

అందుకు భిన్నంగా ఈసారి ఎంట్రీ ఇచ్చిన కపుల్ ను జంటగా ఎలిమినేట్ చేస్తానని చెప్పటమంటే.. వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండే అవకాశం ఉంటుందన్న మాట వినిపిస్తోంది. ఇక..ఈ వారానికి నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యేసరికి జాబితాలో నిలిచిన వారిగా.. రేవంత్.. చంటి.. శ్రీసత్య.. ఫైమా.. ఇనయ.. ఆరోహి.. అభినయశ్రీలు నిలిచారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది తేలాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.