Begin typing your search above and press return to search.

టీవీ నటి సూసైడ్ కేసులో ఎన్ని ట్విస్టులో...!

By:  Tupaki Desk   |   12 Sept 2020 11:15 AM IST
టీవీ నటి సూసైడ్ కేసులో ఎన్ని ట్విస్టులో...!
X
'మనసు మమత' 'మౌనరాగం' సీరియల్స్ లో యాక్ట్ చేసిన నటి శ్రావణి సూసైడ్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు క్రైమ్ సీరియల్‌ ను తలపిస్తూ రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. టిక్‌ టాక్‌ ద్వారా పరిచయమైన దేవరాజ్‌ రెడ్డి కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఎస్‌.ఆర్‌ నగర్‌ పోలీస్ స్టేషన్ లో దేవరాజ్ లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కొడుతున్నారని శ్రావణి, తనతో మాట్లాడిన ఆడియోలు దేవరాజ్ పోలీసులకు అందించాడు. ఇందులో తన చావుకు సాయి కారణమని చివరిసారిగా శ్రావణి మాట్లాడిన ఆడియో పోలీసులకు వినిపించాడు. దేవరాజ్ అందించిన ఆధారాలతో ఈ కేసు ఇప్పుడు సాయి మెడకు చుట్టుకుంతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఈ కేసులో కీలక ఆధారమైన సీసీటీవీ వీడియో బయటకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 7న దేవరాజ్‌ రెడ్డితో కలిసి శ్రావణి పంజాగుట్టలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లినట్లు.. అక్కడికి వచ్చిన సాయి కృష్ణారెడ్డి వచ్చి వారితో గొడవకు దిగినట్లు.. ఆ తర్వాత ఆటోలో ఇంటికి తీసుకెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. అందులో దేవరాజుపై సాయి దాడి చేయడం.. శ్రావణిపై చేయి చేసుకోవడం విజువల్స్ లో స్పష్టంగా కనిపించింది. హోటల్ లో గొడవ జరిగిన మరుసటి రోజే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. అయితే 'ఆర్ఎక్స్ 100' నిర్మాత ఆశోక్ రెడ్డితో సహజీవనం చేయాలంటూ సాయి శ్రావణిని వేధించాడని దేవ్ రాజ్ ఆరోపిస్తున్నాడు. శ్రావణి సూసైడ్ కి కారణం ఎవరు? శ్రావణి కేసులోకి ఆర్ఎక్స్ 100 నిర్మాత పేరు ఎందుకు వచ్చింది? అని అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే పోలీసులు సాయి మరియు అశోక్ రెడ్డిని విచారించిన తర్వాత ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.