Begin typing your search above and press return to search.

విక్రమ్ ను మించిపోయే సలార్ ట్విస్ట్?

By:  Tupaki Desk   |   7 Aug 2022 6:00 PM IST
విక్రమ్ ను మించిపోయే సలార్ ట్విస్ట్?
X
రెబల్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో సలార్ టాప్ లిస్టులో ఉంది అని చెప్పవచ్చు. ఈ సినిమా కంటే ముందే రామాయణం బ్యాక్ డ్రాప్ లో ఆదిపురుష్ అనే సినిమా విడుదల కానుంది. సంక్రాంతికి రాబోయే ఆ సినిమాపై కూడా ఓ వర్గం ప్రేక్షకులలో భారీ స్థాయిలోనే అంచనాలు పెట్టుకున్నారు. కానీ అందరి ఫోకస్ అయితే ఎక్కువగా సలార్ సినిమా పైనే ఉంది.

ఎందుకంటే యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కావడంతో తప్పకుండా తమకు కావలసిన ఫుల్ మాస్ యాక్షన్ కంటెంట్ ఉంటుంది అని నమ్మకంతో ఉన్నారు. ఇక ప్రభాస్ నటించిన చివరి రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. ముఖ్యంగా రాధే శ్యామ్ సినిమా అయితే దారుణాతి దారుణంగా డిజాస్టర్ అయింది.

దీంతో మళ్లీ ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేసే సినిమా ఏదైనా ఉంది అంటే సలార్ అని నమ్మకంగా చెబుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో కూడా విక్రమ్ తరహాలోనే ఒక బలమైన ట్విస్ట్ కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. కమలహాసన్ విక్రమ్ సినిమాలో చివరి పది నిమిషాల్లో సూర్య ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని రోలెక్స్ పాత్ర మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఆ సన్నివేశాల కోసం థియేటర్లకు ఓవర్గం ప్రేక్షకులు మళ్లీ మళ్లీ వెళ్లారు.

అయితే సలార్ సినిమాల్లో కూడా అదే తరహాలో చివరి పది నిమిషాలలో అలజడి సృష్టించే పాత్ర ఒకటి రాబోతుందట. ఆ క్యారెక్టర్ మరేదో కాదు కన్నడ కేజిఎఫ్ స్టార్ యష్ అని తెలుస్తోంది. అయితే మల్టీవర్స్ తరహా లోనే కేజిఎఫ్ రాఖీ బాయ్ చివర్లో చూపిస్తారా లేదంటే కొత్త క్యారెక్టర్ ఏమైనా ప్రజెంట్ చేస్తారా అనేది చూడాలి. అసలు ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే. ఇక సలార్ కు సంబంధించిన విడుదల డేట్ పై త్వరలోనే ఒక అప్డేట్ రానుంది.