Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో ను గే అనుకుంద‌ట‌

By:  Tupaki Desk   |   14 Nov 2016 3:30 PM GMT
ఆ స్టార్ హీరో ను గే అనుకుంద‌ట‌
X
బాలీవుడ్లో మ్యాన్లీగా క‌నిపించే హీరోల్లో అక్ష‌య్ కుమార్ ఒక‌డు. పైగా కెరీర్ ఆరంభంలో.. చాలా ఏళ్ల పాటు యాక్షన్ సినిమాలే చేశాడు. అలాంటి వాడిని గే అనుకుంద‌ట అత‌డి అత్త డింపుల్ క‌పాడియా. ఈ కార‌ణంతోనే ట్వింకిల్ ఖ‌న్నా ముందు అక్ష‌య్ ను పెళ్లి చేసుకుంటానంటే డింపుల్ ఒప్పుకోలేద‌ట‌. త‌న స్నేహితురాలు ఒక‌రు అక్ష‌య్ గే అని చెప్ప‌డంతో.. అదే నిజ‌మ‌ని అనుకుంద‌ట డింపుల్. త‌ర్వాత అది అబ‌ద్ధ‌మ‌ని తెలుసుకుని అక్ష‌య్ తో ట్వింకిల్ పెళ్లికి అంగీకారం తెలిపింద‌ట డింపుల్. త‌మ పెళ్ల‌యి 15 ఏళ్లు పూర్త‌యిన నేప‌థ్యంలో ఓ కార్య‌క్ర‌మంలో అక్ష‌య్ తో క‌లిసి పాల్గొన్న ట్వింకిల్ ఈ విష‌యం తెలిపింది.

అమీర్‌ ఖాన్ తో క‌లిసి ట్వింకిల్ ‘మేలా’ సినిమా చేస్తున్న టైంలో అక్ష‌య్ ఆమెకు పెళ్లి ప్ర‌పోజ‌ల్ పెట్టాడ‌ట‌. ఐతే కెరీర్ ఎలా అని ఆలోచించిన ఆమె.. ‘మేలా’ సినిమా ఆడ‌ని ప‌క్షంలో పెళ్లి చేసుకుందాం అని చెప్పింద‌ట‌. ఆ సినిమా నిజంగానే ఆడ‌లేదు. అది విడుద‌లైన మూడు రోజుల త‌ర్వాత ట్వింకిల్‌.. అక్షయ్‌ కు ఫోన్‌ చేసి పెళ్లికి ఓకే చెప్పింద‌ట‌. అప్పుడు అక్ష‌య్.. ట్వింకిల్ త‌ల్లి డింపుల్‌ కపాడియాను కలిశాడు. ట్వింకిల్‌ ను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. కానీ ఆమె ఆ పెళ్లికి ఒప్పుకోలేదు.అందుకు కార‌ణం.. డింపుల్ స్నేహితురాలు అక్ష‌య్ గే అని అంత‌కుముందోసారి చెప్పింద‌ట‌. ఐతే త‌న గురించి పూర్తిగా తెలుసుకున్నాక పెళ్లికి ఓకే చెప్ప‌మ‌ని అక్ష‌య్ చెప్పాడ‌ట‌. త‌ర్వాత డింపుల్.. అక్ష‌య్ గురించి విచారించి.. అలాంటిదేమీ లేద‌ని నిర్ధ‌రించుక‌న్నాక పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/