Begin typing your search above and press return to search.

బిగ్ బాస్‌ 5లో TV9 ప్ర‌త్యూష.. ఆమె నేప‌థ్యం తెలుసా?‌

By:  Tupaki Desk   |   16 March 2021 12:43 PM GMT
బిగ్ బాస్‌ 5లో TV9 ప్ర‌త్యూష.. ఆమె నేప‌థ్యం తెలుసా?‌
X
బిగ్ బాస్ నాలుగు సీజ‌న్లు ఘ‌న‌విజ‌యం సాధించాయి. ఇప్పుడు ఐదో సీజ‌న్ కోసం స్టార్- మా స‌న్నాహ‌కాలు మొద‌లు పెట్టేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. రియాలిటీ షో అభిమానుల్లో రాబోవు సీజ‌న్ కంటెస్టెంట్స్ ఎవ‌రు? అన్న‌దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. జూన్ మొదటి వారంలో సీజన్ 5 ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది.

ప్ర‌తిసారీ హౌస్ లో టీవీ9 నుంచి ఎవ‌రో ఒక‌రు త‌ప్ప‌నిస‌రిగా క‌నిపిస్తున్నారు. ఆన‌వాయితీ ప్ర‌కారం.. ఈసారి కొత్త‌ సీజ‌న్ లో కూడా టీవీ 9 యాంక‌ర్ ఒక కంటెస్టెంట్ గా ఉండ‌నున్నార‌ని తెలిసింది. ట్యాలెంటెడ్ యాంక‌ర్ ప్ర‌త్యూష ఈసారి బ‌రిలో ఉన్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

సీజ‌న్ 2లో రిపోర్ట‌ర్ దీప్తి న‌ల్ల‌మోతు.. సీజ‌న్ 3లో యాంకర్ జాఫర్ ..సీజన్ 4 లో దేవి నాగవల్లి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ‌గా క‌నిపించారు. వీళ్లంద‌రిలో దీప్తి న‌ల్ల‌మోతు టాప్ పెర్ఫామ‌ర్ గా పోటీలో నిలిచారు. దేవి నాగ‌వ‌ల్లి మంచి ప్లేయ‌ర్ గా రాణించార‌న్న టాక్ వ‌చ్చింది. ఇప్పుడు ప్ర‌త్యూష వంతు వ‌చ్చింది. సెల‌బ్రిటీ ఇంట‌ర్వ్యూలు స‌హా వినోదాత్మ‌క కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌త్యూషకు యువ‌త‌రంలో బోలెడంత ఫాలోయింగ్ ఉంది. త‌న‌కు సోష‌ల్ మీడియాల్లో చక్క‌ని ఫాలోవ‌ర్స్ ఉన్నారు.నేడు ప్ర‌త్యూష పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాల్లో ‌ ఫాలోవర్స్ శుభాకాంక్ష‌లు తెలిపారు. క్లోజ్ ఫ్రెండ్ టీవీ 9 యాంకర్ .. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ దేవి నాగవల్లి బర్త్ డే సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫొటోలను ఫేస్ బుక్ లో వైర‌ల్ చేశారు.

ఈసారి బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల జాబితాలో యాంకర్ రవి.. యూట్యూబ్ సంచలనం షణ్ముఖ్ జస్వంత్.. బమ్ చిక్ బబ్లూ.. హెచ్ ఎం టీవీ యాంకర్ రోజా.. టిక్ టాక్ స్టార్ మహాతల్లి త‌దిత‌రుల పేర్లు జాబితాలో ఉన్నాయి. వీళ్ల‌తో పాటు ప్ర‌త్యూష పేరు చేరింది. ఇక ప్ర‌త్యూష నేప‌థ్యం ఆస‌క్తిక‌రం. త‌న స్వ‌స్థ‌లం తూ.గో జిల్లా తుని అని తెలిసింది. క‌ళాకారుల ఫ్యామిలీ నుంచి వ‌చ్చి టీవీ న్యూస్ ప్రెజెంట‌ర్ గా ప‌రిణ‌తితో ఆక‌ట్టుకున్న ప్ర‌త్యూష టీవీ ప్రొడ‌క్ష‌న్ లో ప్ర‌వేశించాల‌న్న ఆస‌క్తిని క‌లిగి ఉన్నార‌ని తెలుస్తోంది.